న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 : చైనా-పాకిస్తాన్ బంధం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ అభ్యంతరాలను పట్టించుకోని రెండు దేశాలు చైనా-పాక్ కారిడార్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పాక్ అక్రమిత కశ్మీర్ మీదుగా రోడ్లు, పైపులైన్లు నిర్మించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా... ఇరు దేశాలు తమ పని తాము కనిచ్చేస్తున్నాయి. 3వేల కిలోమీటర్లు ఉండే ఈ కారిడార్ కోసం జోరుగా పనులు కూడా సాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాకిస్తాన్ పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొలిరోజే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. దీంతో పాటు మరో 50 ఒప్పందాలపై కూడా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. సి పాక్ ప్రాజెక్టులో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. పీవోకే మీదుగా నిర్మిస్తున్న కారిడార్‌వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు ఏర్పడనున్నాయి. ఈ కారిడార్‌వల్ల రైల్లు మార్లాలు, పైపు లైనులు కూడా నిర్మించనున్నారు.
No comments:
Post a Comment