Monday, 13 April 2015

ఘర్‌ వాపసీ అంబాసిడర్‌ బిఆర్‌ అంబేద్కర్‌!

ఘర్‌ వాపసీ అంబాసిడర్‌ బిఆర్‌ అంబేద్కర్‌!

న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 12: అంబేద్కర్‌ 125వ జయంతిని ఘనంగా నిర్వహించడానికి దేశంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం ఆయన్ను మరో కోణంలో వెలుగులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆ దిశగానే అంబేద్కర్‌ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆర్‌ఎస్‌ఎస్‌ తన అధికార పత్రిక పాంచజన్య ఆర్గనైజర్‌ ద్వారా జనంలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దళితోద్యమ నేతగా, భారత రాజ్యంగా నిర్మాతగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారతదేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దీంతోపాటు ఆయనలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చి ఘర్‌ వాపసీ సిద్ధాంతానికి ఆయన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెరపైకి తేవాలని సంఘ్‌ యోచిస్తోంది.

ఇప్పటికే అంబేద్కర్‌ జీవిత విశేషాలతో కూడిన పాంచజన్య ప్రత్యేక సంచికను విడుదల చేసింది. 24 పేజీల్లో అంబేద్కర్‌కు సంబంధించి సచిద్ర కథనాలు ప్రచురించింది. ఆయన్ను యుగానికి ఒక్కడుగా కొనియాడింది. ఆయన ఇస్లాం, క్రైస్తవ మత మార్పిడిలను వ్యతిరేకించారని పాంచజన్యలో పేర్కొంది. వీర్‌ సావర్కార్‌, మదన్‌ మోహన్‌ మాలవ్య వంటి వారి సరసన అంబేద్కర్‌ను నిలిపింది. హిందువులను సంఘటిత పరచడానికి అంబేద్కర్‌ 1924-35 మధ్య దశాబ్ద కాలానికిపైగా కృషి చేశారని ప్రశంసలు కురిపించింది.

పాకిస్థాన్‌లో దళిత హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్న తీరును నాడు అంబేద్కర్‌ వ్యతిరేకించారని, అలాంటి వారు భారత్‌కు రావొచ్చని ఆయన పిలుపునిచ్చారని పాంచజన్యలో పేర్కొన్నారు. ఈ కథనాల ద్వారా ఘర్‌ వాపసీని అంబేద్కర్‌ సమర్థించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిస్తోంది. అయితే సంఘ్‌ పరివార్‌ వాదనతో చాలా మంది విభేదిస్తున్నారు. అంబేద్కర్‌ వైఖరిని ఆరెస్సెస్‌ వక్రీకరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.


In new light: Now, RSS says BR Ambedkar supported Ghar Wapsi

Vasudha Venugopal, ET Bureau Apr 10, 2015, 02.11AM IST
(The RSS move is the latest…)
NEW DELHI: The world may know BR Ambedkar as a Dalit leader and a visionary who headed the committee that wrote the Indian Constitution but the RSS has decided to bring out what it calls "lesser known facets" about him. On Ambedkar's 125th birth anniversary next Tuesday, both the Organiser and Panchjanya will issue collector's editions, 200-page bumper issues on Ambedkar, where he would be celebrated as a 'purifier' who vehemently spoke against Islamic 'aggression', conversion to Islam, communism and Article 370.

The RSS move is the latest in a series of attempts by political and ideological groupings to appropriate one of India's greatest leaders. Till now, Sangh publications have never had a 'collector's edition' but only special issues limited to RSS founder KB Hedgewar and the Ram Janmabhoomi movement. At the recently-held Nagpur conclave, the Sangh reiterated its 'one well, one temple, one crematorium for all' policy and decision to project Ambedkar as a unifier of people to show its emphasis was on creating an inclusive society.
Ambedkar was a nationalist, the special editions would say and have pieces by Sangh's Dalit leaders and even joint secretary Krishna Gopal. The books will be launched by the Sangh organising secretary Bhaiyyaji Suresh Joshi.
The focal point will be Ambedkar's views on Pakistan. "He saw the universal brotherhood of Islam uniting just Muslims. He was critical of the spirit of aggression of political Islam that takes advantage of the weakness of Hindus and follows gangsterism," said Prafulla Ketkar, Organiser's editor. "Also, when in Pakistan and some provinces such as Hyderabad Scheduled Caste Hindus were forcibly converted, Ambedkar warned them against it and told the converted Hindus they would be welcomed back.
In a way, he also supported ghar wapsi," he added. "That he converted to Buddhism after Gandhi's death and as per his promise to Gandhiji chose the religion closest to Hinduism after giving a lot of time to Hindu society.

No comments:

Post a Comment