Sunday, 19 April 2015

భారత్‌లో ముస్లింల ఓటుహక్కు రద్దు!

భారత్‌లో ముస్లింల ఓటుహక్కు రద్దు!

April 13 2015 11:47

అసలే హిందూత్వ ఎజెండాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న  ప్రధాని మోడీ.. ఈ దేశంలో ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేసేయబోతున్నారా? భారత్‌ మీద ఉన్న రాజ్యాంగబద్ధమైన లౌకిక ఇమేజిని పూర్తిగా చెరిపేసి.. దీనిని ‘హిందూ రాజ్యం’గా మార్చేయబోతున్నారా? అధికారికంగా హిందూదేశం అయిన నేపాల్‌లో కూడా ఓటు హక్కు విషయంలో ముస్లింల పట్ల వివక్ష ఉండదు. అలాంటిది.. భారత్‌ను మాత్రం ముస్లింలకు ఓటు హక్కు కూడా ఉండని.. కరడుగట్టిన హిందూరాజ్యంగా మార్చేయబోతున్నారా? ... ఇలాంటి అనేకానేక ప్రశ్నలను లేవనెత్తేలా శివసేన పార్టీకి చెందిన కేంద్రంలో భాగస్వామి అయిన ఒక  ఎంపీగారి మాటలు లేవనెత్తుతున్నాయి. వికారుద్దీన్‌ ముఠా ఎన్‌కౌంటర్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో శివసేన నాయకులనుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దేశప్రజల్లో అనేక సందేహాలు లేవనెత్తేవిధంగా కనిపిస్తోంది. 

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌

భారత్‌లో ముస్లింల ఓటుహక్కు రద్దు!

వికారుద్దీన్‌ ముఠా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ముస్లింల్లోని ఒక వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమైన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. 


ఎంపీ సంజయ్‌రౌత్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

భారత్‌లో ముస్లింల ఓటుహక్కు రద్దు!

అయితే దీనికి జవాబుగా, ఒవైసీ మీద శివసేనకు చెందిన ఎంపీ సంజయ్‌రౌత్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలను రెచ్చగొట్టి ఓటుబ్యాంకు రాజకీయాలకు ఒవైసీ సోదరులు పాల్పడుతున్నారంటూ ఆయన రెచ్చిపోయారు. శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నాకు రాసిన సంపాదకీయంలో సంజయ్‌ రౌత్‌ ఇలా.. ఆవేశాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఒవైసీ సోదరుల ఓటు బ్యాంకు రాజకీయాలకు చెక్‌ చెప్పాలంటే.. ఈ దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలంటూ రౌత్‌ డిమాండ్‌ చేయడం విశేషం. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే హైదరాబాద్‌ కు రావాలంటూ ఒవైసీ చేసిన సవాల్‌ను రౌత్‌ తీవ్రంగా పరిగణించారు. హైదరాబాద్‌ ఇండియాలో భాగమా? లేక లాహోర్‌ కరాచీ పెషావర్‌ అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఒవైసీ సవాలును బట్టి.. ఇది పాకిస్తాన్‌ కాదు కదా అని అర్థం వచ్చేలా శివసేన  ఎంపీ నిప్పులు చెరగడం నిజమే కావొచ్చు... కానీ ఆయన చెబుతున్న మాటల అర్థమేమిటో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన కనీసం ఆలోచించుకుంటున్నారా అనేది ప్రజల ప్రశ్న. 


ముస్లింలకు ఓటు హక్కు 

భారత్‌లో ముస్లింల ఓటుహక్కు రద్దు!

ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని చెప్పడం ద్వారా ఈ దేశప్రజల్లో ఉండే లౌకిక స్ఫూర్తిని మాత్రమే కాదు.. భాజపా  లేదా ఎన్డీయే కూటమి పార్టీలు ప్రధానంగా భుజానికెత్తుకునే హిందూమత స్ఫూర్తిలో ఉండే పరమత సహనాన్ని కూడా కాలరాయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లున శివసేన ఎంపీ అర్థం చేసుకోవాలి. ఇలాంటి రెచ్చగొట్టే దుర్మార్గపు వ్యాఖ్యలు.. ఈ దేశంలో కొన్ని శతాబ్దాలుగా ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని సర్వనాశనం చేస్తాయని ఆయన తెలుసుకోవాలి. తన వ్యాఖ్యలు ఆవేశంలో దొర్లినవే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదనే వివరణ ఇచ్చుకుంటే తప్ప.. చేసిన పాపం కడిగేసుకోవడానికి కనీసం ప్రయత్నం చేసినట్లు కాదు!

No comments:

Post a Comment