Tuesday, 21 April 2015

తెలంగాణలో ఉగ్రవాదలు దాడులకుపాల్పడే అవకాశం

తెలంగాణలో ఉగ్రవాదలు దాడులకుపాల్పడే అవకాశం
అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్‌ హెచ్చరికలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 : తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్‌ఐ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. పోలీసులే లక్ష్యంగా దాడులు జరపవచ్చని అప్పమత్తంగా ఉండాలని నిఘా విభాగం పోలీసులకు సూచించింది. పోలీసు ఉన్నతాధికారులకు భద్రత పెంచడంతో పాటు, పోలీస్‌స్టేషన్లలో ఎంట్రీఫోర్సులను ఏర్పాటు చేయాలని తెలిపింది. గస్తీ పెంచాలని నిఘా విభాగం స్పష్టం చేసింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నల్గొండ జిల్లాలో రెండు ఎన్‌కౌంటర్‌లు జరిగిన నేపథ్యంలో పోలీసులనే టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడవచ్చని ఇంటలిజెన్స్‌ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

No comments:

Post a Comment