అమరావతిని చైనా రెండో స్వగృహంగా చేసుకోవాలి:బాబు
మేజర్‌న్యూస్, హైదరాబాద్‌ః సాంస్కృతిక సారూప్యత రీత్యా ఎపి కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కోరారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మూడో రోజైన మంగళవారం వివిధ సంస్ధల యాజమాన్యాలతో సమావేమయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ అమరావతి నుండి ఎపిలోనే కాకుండా మొత్తం దేశమంతా వర్తక, వాణిజ్యాలు చేసుకోవచ్చన్నారు. రాజధాని నిర్మాణం స్పీడ్‌రైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.
ఎపిలో ఎర్రచందనం నిల్వలు అధికంగా ఉన్నాయని అంటూనే ఇప్పటికే ఎర్రచందనాన్ని చైనా అధికంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతంలో విచ్చలవిడిగా జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తాము అడ్డుకట్ట వేసి నియంత్రించినట్లు చెప్పారు. అవకాశాల రీత్యా తమ రాష్ట్రానికి వస్తే పరిశ్రమల పెట్టుకునేందుకు త్వరితగతిన అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. త్వరగా వచ్చి ఎపిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే, గుజరాత్, మహారాష్ట్ర కన్నా ముందే పూర్తి చేయవచ్చని కూడా చంద్రబాబు తెలిపారు.
మూదో రోజు చంద్రబాబు గ్విజు ప్రావిన్స్‌కు సంబంధించి వివిధ కంపెనీలతో సమావేశం జరిపారు. ఈ భేటీలో కెడా క్లీన్ ఎనర్పీ కంపెనీ, ఇయోమెస్ హ్యూటో కార్పొరేషన్, చైనా ట్రాన్స్‌మిషన్ ఇన్నో గ్రీన్, షో గ్యాంగ్ గైగాంగ్ స్పెషల్ స్టీల్ కంపెనీ, పవర్ కన్‌స్ట్రక్షన్స కార్పొరేషన్ ఆఫ్ చైనా నుండి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. గ్విజు ప్రావిన్స్ ప్రతినిధి మాట్లాడుతూ ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయటం అటు చైనాకు ఇటు భారత్‌కు ఉభయతారకమన్నారు. ఎపిలో పెట్టుబడుల గురించి చైనా ప్రభుత్వానికి ఇప్పటికే వివరించామని అన్నారు. ఎపిలోని కంపెనీలను గ్విజు ప్రావిన్స్‌కు ఆహ్వానించారు. బిగ్ డేటా ఇండస్ట్రీపైనే గ్విజులో తమ వర్తక, వాణిజ్యాలు పూర్తిగా ఆధారపడినట్లు చెప్పారు. ఇంటెలిజెంట్ మ్యాన్యుఫాక్షరింగ్, హైఎండ్ మ్యాన్యుఫాక్షరింగ్ ఇన్నోవేషన్ సపోర్ట్‌తోనే చైనాలో పారిశ్రామికీకరణ వేగవంతమైన విషయాన్ని గుర్తుచేశారు. గ్విజు ప్రావిన్స్‌లో వర్తక, వాణిజ్యాలకు భారతీయ కంపెనీలను నాస్కాం ఇప్పటికే ఆహ్వానించిన సంగతిని కూడా తెలిపారు ట్రాన్స్‌పోర్టు ఇంజనీరింగ్ గ్రూప్ ప్రతినిధి మాట్లాడు తూ, ఎపిలో తమ కార్యకలాపాల విస్తరణకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. మౌళిక సదుపాయాల కల్పనలో తమ సంస్ధకు 60 ఏళ్ళ అనుభవం ఉన్నట్లు చెప్పుకు న్నారు.
గ్విజు ప్రావిన్స్ లాగే ఎపిని కూడా త్వరగానే అభివృద్ది చేస్తామన్నారు. కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భారత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎపిలో గిజోయ్ ప్రావిన్స్ పారిశ్రామికవేత్తల బృందం అద్భుతాలు చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశాలు స్వల్పంగా ఉంటే భారత్‌లోను ప్రత్యేకించి ఎపిలో పుష్కలంగా ఉన్నట్లు చెప్పారు. రోడ్లు, మౌళిక సదుపాయల కల్పన, విమానాశ్రయాల నిర్మాణం, స్పీడ్ ట్రాన్స్ మిషన్ టూరిజంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు.

No comments:
Post a Comment