Wednesday 16 March 2022

హిజాబ్‌ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య -ఎ. సునీత

 హిజాబ్ గురించిన ఒక  బ్రిలియంట్ వ్యాసాన్ని భూమికలో చదివాను. 

రచయిత్రి Achyuta Suneetha చాలా స్టడీ చేసి ఈ వ్యాసం రాసారు.

హిజాబ్‌ ఒక ఆధిపత్య లౌకికవాద సమస్య

 -ఎ. సునీత

మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్‌ (జుట్టుని కప్పి ఉంచే ముసుగు) వేసుకుంటే కాలేజీకి రావొద్దని చెప్పేశారు. యూనిఫాం నియమాలకు హిజాబ్‌ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసకున్నామని చెప్పారు. సగానికి సగం మంది స్త్రీలని చదువు రాకుండా ఉంచే ఈ దేశంలో కాలేజీ చదువు వరకూ వచ్చే అమ్మాయిలని, అందులోనూ అణగారిని ముస్లిం సమూహానికి చెందిన అమ్మాయిలని చదువుకు దూరం చెయ్యటానికి ఇంత విచిత్ర ఎత్తుగడ బహుశా ఎవరికీ తట్టి ఉండకపోవచ్చు. ఇలా చదువు నుండి బహిష్కారానికి గురైన ఆ అమ్మాయిలు కాలేజీ విధించిన ఈ అనైతికమైన, చట్ట విరుద్ధమైన బహిష్కారానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, విద్యార్థుల మధ్య సంఫీుభావం ఏర్పడకుండా, కొంతమంది వారిపైన దాడులకు దిగారు.

అయితే చర్చ చదువు, కాలేజీ నుండి ముస్లిం అమ్మాయిల బహిష్కరణ చుట్టూ కాక, వారు తలకి చుట్టుకున్న హిజాబ్‌ చుట్టూ ఎందుకు తిరుగుతోంది? భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా హిజాబ్‌ ముస్లిం స్త్రీల తీవ్ర పితృస్వామ్య అణచివేతకు చిహ్నమని, ముస్లిం స్త్రీలు హిజాబ్‌ వేసుకోకుండా ఉంటేనే దాన్నుండి విముక్తి పొందినట్లనీ, ముస్లిం స్త్రీలని వారి మతం నుండి రక్షించాల్సిన అవసరం ఉందనే ఒక ఉదారవాద భావజాలం గత శతాబ్దంలో బయటపడి ఈ శతాబ్దంలో కామన్‌సెన్స్‌గా మారింది. ఈ భావజాల ప్రభావం వల్లే హిజాబ్‌ని ఇస్లాం మత ఛాందసానికి ఒక చిహ్నంగా మాత్రమే చూడడం ప్రపంచంలో సామాన్య ప్రజలు కూడా అలవాటు చేసుకున్నారు. దానికి న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌ పత్రికల నుండి మన స్థానిక వార్తా పత్రికల వరకు తమ వంతు సహకారం అందిస్తూనే ఉన్నాయి.

ఈ భావజాలం ఇంత బలంగా వేళ్ళూనుకునేటట్లు చేయడానికి రాజకీయ, ఆర్థిక కారణాలు ప్రధానమైనవి. ప్రపంచ యుద్ధాల మధ్యలో పశ్చిమ ఆసియా దేశాల్లో పెట్రోల్‌ని కనుగొనడంతో ఆయా దేశాలని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవటం యూరోప్‌ దేశాలకు చాలా అవసరమైంది. సాంస్కృతికంగా అవి వెనుకబడి ఉన్న దేశాలని, దానికి ఇస్లాం కారణమని, ఇస్లాం మతం ఛాందస మతమనే ప్రచారం విపరీతంగా జరిగింది. అసలు ఆయా దేశాలు ఆధునీకరణ చెందలేవని, ఎందుకంటే అవి మౌలికంగా యూరోపియన్‌ సమాజాలకు భిన్నమయినవనే పండిత ప్రచారం కూడా యూరోపియన్‌ సాంస్కృతిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చేశారని ఎడ్వర్డ్‌ సయీద్‌ (1935`2003) ఓరియెంటలిజం అనే ప్రభావశీల పుస్తకంలో ఎత్తి చూపారు. 

మన దగ్గర కూడా ఈ రకమయిన పోకడలు… అంటే ముస్లిం సమాజం అత్యంత పితృస్వామికమైందనీ, ఎప్పటికీ మార్పు చెందకుండా ఉందనీ, కాబట్టి బలవంతంగా వారిని మార్చాలనే వాదనలు… గత ముప్ఫై ఏళ్ళలో ఊపందుకున్నాయి. దీనిలో తప్పేముంది నిజం కాదా అని వాదించే వాళ్ళలో స్త్రీ వాదులు, ముస్లిం వాదులు, ప్రగతిశీల వాదులు కూడా ఉన్నారు. అయితే ఆధునికీకరణ ప్రతి సమాజంలో వివిధ రకాలుగా వాస్తవీకరించబడుతుంది. మనవంటి నిచ్చెన మెట్ల సమాజంలో హిజాబ్‌ ధారణ కూడా ఆధునికీకరణలో భాగమనే విషయం అర్థం చేసుకోవాలి. స్త్రీ, పురుషులలో ఎవరి వస్త్రధారణని, సాంస్కృతిక చిహ్నాలని ఎంత మేరకు, ఏ రకంగా ఆధునీకరించాలి, ఏ చిహ్నాలని మార్చొద్దు అనే విషయం, ఎంతమేరకు ఆధునీకరించాలి అన్న విషయాలను ‘చీర’ చరిత్రని గమనిస్తే అర్థమవుతుంది.

మనకు తెలిసిన చీర కట్టు.. జాకెట్టు, లోపలి లంగా వేసుకుని, కుచ్చెళ్ళతో, పమిటతో ఉండేది గట్టిగా 120 ఏళ్ళ క్రిందటే తయారయింది. అప్పటివరకూ జాకెట్టు, లోపలి లంగా లేకుండానే, గోచీ పట్టి చీర కట్టుకునేవాళ్ళు. ఎప్పుడయితే మధ్య తరగతి స్త్రీలు, పురుషులతో కలిసి బ్రిటిష్‌ వారితో ఫంక్షన్లలో పాల్గొనాల్సి వచ్చిందో అప్పుడు ఈ చీర కట్టుని ఆధునీకరించాల్సి వచ్చిందని చరిత్రకారిణి జానకి నాయర్‌ అంటారు. గత నలభై ఏళ్ళలో హిజాబ్‌ కూడా ఆధునీకరణకి, గౌరవప్రద స్త్రీత్వానికి చిహ్నంగా రూపుదిద్దుకుంది. అప్పటివరకూ ముస్లిం స్త్రీలు, మగవాళ్ళతో కలిసి బయటికి వెళ్ళాలంటే ఒక తెల్ల షాల్‌ వంటిది కప్పుకుని బయటికెళ్ళేవారు. వాళ్ళేకాదు, గౌరవప్రదమయిన కుటుంబాలకి చెందిన ఏ ఆడవాళ్ళయినా, ఏ మతానికి చెందిన వాళ్ళయినా, మగవాళ్ళు లేకుండా తమంతట తాము బయటికి వెళ్ళాల్సి వస్తే జట్కా బండికి, ఎడ్ల బండికి పరదా కట్టుకోవడం జరిగేది. తాము బయటికి వెళ్ళడానికి, పని చేసుకోవడానికి అనుకూలంగా ముస్లిం సమాజాలు ఆమోదించిన వస్త్రధారణ… హిజాబ్‌, బురఖా. ఆ తర్వాత ఆధునిక సార్వత్రిక విద్య వ్యాపించేకొద్దీ హిజాబ్‌, కొన్ని చోట్ల బుర్ఖా వ్యాపిస్తూ వచ్చింది. 

జావీద్‌ ఆలం (హైదరాబాద్‌కి చెందిన రాజనీతి శాస్త్రజ్ఞుడు) రాసిన ‘రిక్షా`బురఖా’ వ్యాసంలో హైదరాబాద్‌లో ఈ పరిణామం ఎలా జరిగిందో స్పష్టంగా చెప్తారు. 1970ల చివర్లో అప్పటివరకూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కనిపించే ముస్లింల ప్రధాన ఉపాధి రిక్షా, మధ్య ప్రాశ్చ్య దేశాలకి వలసలతో మారి ఆటోలకి మరలిందని, మగవాళ్ళందరూ బయటి దేశాల్లో ఉండడంతో ఆడవాళ్ళు అన్ని పనులూ చేసుకోవడానికి బయటికి రావాల్సి వచ్చిందని, అప్పుడు ఆ దేశాల్లో ధరించే బుర్ఖా గౌరవప్రదమయిన వస్త్రధారణగా పరిణమించిందని విశ్లేషించారు. 

నేను 1990లలో పాత బస్తీలో పెద్ద వయసున్న ముస్లిం స్త్రీలతో కుటుంబంలో వచ్చిన మార్పుల గురించి చర్చించేటప్పుడు, వాళ్ళు యువతరం ముస్లిం స్త్రీల గురించి నాతో ఫిర్యాదు చేశారు, ‘‘మేమయితే మా మగవాళ్ళు లేకుండా ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, ఈ తరం వాళ్ళు బుర్ఖా వేసుకుని, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు’’ అని. బుర్ఖా హైదరాబాద్‌ ముస్లిం సమాజ ఆధునికీకరణలో భాగమై యువతరం స్త్రీల మొబిలిటీని పెంచిందని వీళ్ళ బాధ.

అంటే ముస్లిం సమాజాల్లో పితృస్వామ్య ఆధిపత్యం లేదా అని అడగొచ్చు. అందరూ స్వచ్ఛందంగానే బురఖా వేసుకుంటారా అని కూడా అడగొచ్చు. తప్పకుండా ఉంది. మిగిలిన అన్ని సమాజాల్లో స్త్రీల వస్త్రధారణపై ఎంత నియంత్రణ ఉందో, అక్కడ కూడా అంతే. స్వంత బట్టల మీద వేరే వాళ్ళ హక్కేంటి అని వాదించేవాళ్ళు ఒకసారి తమ తమ స్వంత సమాజాల్లో, కుటుంబాల్లోనే కాదు, మన ప్రజామోదిత సంస్కృతిలో స్త్రీల వస్త్రధారణపై ఏ పితృస్వామ్య నియంత్రణా లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? హిందూ యువతులు బొట్టు లేకుండా వెళ్ళినపుడు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు, బస్సులో ప్రయాణీకుల నుండీ, కూరల బండి వాళ్ళ దాకా అందరూ కామెంట్‌ చేసేవాళ్ళే. ఏ పితృస్వామ్య కట్టుబాట్లూ లేకుంటేనే, పెళ్ళయిన స్త్రీలు తూచా తప్పకుండా బొట్టు, మంగళసూత్రం, మెట్టెలు పెట్టుకెళ్తున్నారా? గురువుల దగ్గరి నుండి సినిమా పాటల వరకూ అందరికీ, అన్నింటికీ స్త్రీల వస్త్రధారణ సామూహిక సాంస్కృతిక వనరుగా ఇప్పటికీ ఎందుకున్నట్లు?

అయితే ఎవరి వస్త్రధారణ కేవలం సాంస్కృతిక చిహ్నంగా అంటే మన కళ్ళకి మామూలుగా గోచరిస్తుందనేది సామాజిక ఆధిపత్యంపై ఆధారపడుతుంది. మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భూమి పూజలు, ఆఫీసుల్లో దేవుళ్ళ ఫోటోలు, చేతికి తాయత్తులు, ముఖానికి పసుపు, కుంకుమ, మెడలో నల్లపూసలు, చేతులకి గాజులు మతపరమయిన చిహ్నాలుగా కాక, సాంస్కృతిక చిహ్నాలుగా పరిగణింపబడడానికి కారణం మరేంటో కాదు హిందూ సమూహ ఆధిపత్యమే. ప్రతి దేశంలో ఆధిపత్య మత సంస్కృతికి అనుగుణంగా అక్కడి లౌకికత, దాని చిహ్నాలు రూపుదిద్దుకుంటాయని లౌకికత, మతాల మధ్య సంబంధాలని అధ్యయనం చేసిన తలాల్‌ అసద్‌ (పాకిస్తాన్‌ నుండి సౌదీకి వలస వెళ్ళిన కుటుంబంలో పుట్టి అమెరికాలో పనిచేసే ఆంథ్రోపాలజిస్ట్‌) అంటారు. 

యూరోపియన్‌ దేశాల్లో క్రిస్టియన్‌ మత సంస్కృతి లౌకికతని రూపుదిద్ది, సమాజ సంస్కృతిగా ఎలా పరిణమించిందో అలాగే మన దేశంలో హిందూ మతం లౌకికతను రూపుదిద్దటం వల్ల హిందూ మత చిహ్నాలని లౌకికతకి విరుద్ధమైనవని అర్థం చేసుకోవటం లౌకికవాదులమని భావించే వారికి కూడా కష్టం.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వైపరీత్యం లౌకికవాదాన్ని రాజ్యం మైనారిటీ సమూహాలపై వాడటానికి ఒక ఆయుధంగా చేసుకోవటం. ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ వంటి యూరోప్‌ దేశాల్లో హిజాబ్‌ మీద బహిష్కరణ ఈ కోవకి చెందినదే. ఒక దేశంలో విభిన్న సమాజాలు, భిన్న సమూహాలు తమ తమ లౌకికతని భిన్నంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను తోసిపుచ్చి ఒకే రకమైన ఆధునికీకరణ, లౌకికత్వం అందరి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నమే ఈ హిజాబ్‌ బహిష్కరణ. 

ఫ్రాన్స్‌లో హిజాబ్‌ గురించిన చర్చలో విమర్శనాత్మకంగా ఆలోచించే ఫ్రెంచ్‌ స్త్రీ వాదులు, ఈ బహిష్కరణ ఫ్రాన్స్‌కి అల్జీరియాతో ఉన్న వలసవాద సంబంధం నుండి, అల్జీరియన్‌ ప్రజలు ఫ్రాన్స్‌తో చేసిన సుదీర్ఘ పోరాటం నుండి, చవిచూసిన ఓటమి నుండి, ప్రధానంగా ముస్లింలయిన ఆ వలస ప్రజలకన్నా తాము భిన్నమయిన వారమని నిరూపించుకోవాలనే ఇచ్ఛ నుండి పుట్టిందని ఎత్తి చూపారు. అన్ని పౌర, ప్రాథమిక హక్కుల్నీ పణంగా పెట్టి ఒక మూసపోసిన లౌకికతను దేశ అస్తిత్వానికి ఒకే ఒక చిహ్నంగా ఎత్తి చూపటం దీని లక్షణం. 

మన దేశంలో ముస్లిం అమ్మాయిల చదువుని పణంగా పెట్టటం ఇటువంటి లౌకికవాద హింసలో భాగమే. ముస్లిం లౌకికతను అర్థం చేసుకోవాలంటే ఆయా ముస్లిం సమూహాల్లో దానిపై జరిగే చర్చను గమనించాలి. ముస్లిం స్త్రీలలో బుర్ఖాపై జరిగే చర్చని అర్థం చేసుకోవాలి. నూర్జహాన్‌ బేగం వంటి కమ్యూనిటీలో పనిచేసే ముస్లిం స్త్రీలు తమకి అలవాటు లేకపోయినా బుర్ఖా, హిజాబ్‌ ధరించాల్సి వస్తుందని, అది పెద్ద విషయం కాదని నాతో అన్నారు. పదిహేనేళ్ళ క్రితమే, ఈ బుర్ఖా గురించి స్త్రీ వాదులకి, ప్రగతి శీల వాదులకి ఉండే ఆబ్సెషన్‌ని ఎత్తి చూపి చిరాకుపడ్డారు. మాకు చదువు, ఉద్యోగాలు కావాలి కదా, అవి కనపడవా మీకు అని అడిగారు.

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా చేసిన పదేళ్ళ యుద్ధంలో నిండా ముసుగు వేసుకున్న స్త్రీలు, మూడు తలాక్‌ల నిషేధ చట్టంతో ఇక్కడ ముస్లిం స్త్రీలు పితృస్వామ్యం నుండి ‘విముక్తు’లయ్యారని అనేకమంది భావించారు. కానీ ఇదే సమయంలో ఎంతోమంది హిజాబ్‌ ధరించిన ముస్లిం స్త్రీలు వారి వారి దేశాల్లో ఎన్నో రకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా షాహీన్‌బాగ్‌ ఉద్యమంలో హిజాబ్‌ ధరించిన స్త్రీలు, పెద్ద చదువుల్లో ఉన్న వాళ్ళతో సహా… పౌరసత్వం కోసం, ఈ దేశ లౌకికత్వం కోసం, తమ అస్తిత్వం కోసం కనీ వినీ ఎరుగని పోరాటం చేశారు, కేసుల్లో ఇరికించబడ్డారు, జైళ్ళల్లో మగ్గుతున్నారు. తాము పితృస్వామ్య బాధితులం కన్నా రాజ్య హింస, మూస లౌకికవాదం, హిందూత్వ మెజారిటీ విముక్తి వాద బాధితులం అని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ, లీలా అబూ లూగోడ్‌ (పాలస్తీనాలో పుట్టి ముస్లిం సమాజాలపైన అనేక అధ్యయనాలు చేసిన ఆంథ్రోపాలజిస్ట్‌) అన్నట్లు ఇప్పటికీ ముస్లిం స్త్రీలని పితృస్వామ్యం నుండి విముక్తుల్ని చెయ్యాలనే జాడ్యం ఒక పట్టాన ఎవరినీ వదిలి పోవట్లేదు.

ఆయా యువతులని ముస్లిం సమాజ పితృస్వామ్యం నుండి విముక్తి చెయ్యటానికి వాళ్ళు కాలేజీకి హిజాబ్‌ వేసుకోకుండా రావటం ముఖ్యమని అనటం కేవలం ఒక పెత్తందారీ స్త్రీవాదం. కాలేజీలు, కోర్టులు హిజాబ్‌లు వేసుకున్న ముస్లిం బాలికలని స్కూళ్ళకి, కాలేజీలకి రాకుండా చెయ్యటం వారిని చదువు నుండి దూరం చేసి, ముస్లిం సమాజాన్ని లౌకికవాదం పేరుతో ‘వేరుచెయ్యటమే’. కోర్టులు కొత్తగా మతపరమైన చిహ్నాలని నిషేధించటం హిందూ లౌకికతని ఇతరులపైన రుద్దటమే. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవటం, విషయాన్ని మసిపూసి మారేడు కాయ చెయ్యటం తప్ప మరేమీ కాదు!

ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?

 ఏది మతపరమైన ఆచారమో తేల్చి చెప్పే పని కోర్టుదా?


ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారామా? కాదా? అన్నది కాదు కదా ఇక్కడ అసలు సమస్య?  ఇస్లాంలో తప్పనిసరైన మతాచారం ఏది? ఏది కాదు? అన్నది తేల్చటానికి వేరేగా ఇస్లామిక్  పండిత వర్గం ఉంది ఆ గొడవ వాళ్లది తప్పితే అది తేల్చాల్సింది కోర్టు కాదు. 


భిన్న మతాల, సంస్కృతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఒక చోట చదివేటప్పుడు వారి వారి మతాలకు చెందిన చిహ్నాలనో, సంస్కృతినో అనుసరించుకుంటూనే అందరూ ఒకే రకమైన యూనిఫాంతో స్కూలుకు రావచ్చా? రాకూడా? అన్నది ఇక్కడ అసలు మాట్లాడుకోవలసిన పాయింట్.


రావచ్చు.. తప్పులేదన్నప్పుడు మల్లా వేరేగా ముస్లిం విద్యార్థినులు యూనిఫాం పాటిస్తూనే తలపై ‘హిజాబ్’ లేదా ‘హెడ్ స్కాఫ్’ ధరించి రావచ్చా? రాకూడదా? అన్న ప్రశ్నపై వేరేగా చర్చించే అవసరం ఉండదు.


ఒకవేళ “ముస్లిం విద్యార్థినులు యూనిఫాం పాటిస్తూనే హిజాబ్ ధరించి రాకూడదు” అని తీర్పు ఇస్తే..  అదే స్కూల్లో చదివే భిన్న మతాల, సంస్కృతులకు చెందిన ఇతర విద్యార్థినీ, విద్యార్థులు సైతం వారి వారి మతాలకు చెందిన చిహ్నాలను, సంస్కృతిని రూపుమాపేసుకుని స్కూలుకు రావాలన్న రూలు అందరికీ కలిపి పెట్టటం సరైన న్యాయం చెయ్యటం అవుతుంది.   


పోనీ, హిజాబ్ ధరించి వస్తున్న ఆ ముస్లిం విద్యార్థినులు యూనిఫాంను ఏమైనా వ్యతిరేకించారా? అంటే కాదు కదా! ఇతర మతాలకు చెందిన విద్యార్థులు తమ తమ మతపరమైన చిహ్నాలు ధరిస్తూ స్కూల్ యూనిఫాంలో వస్తున్నప్పుడు ఒక్క ముస్లిం విద్యార్థినులు మాత్రమే తలకు హిజాబ్ చుట్టుకు వచ్చినంత మాత్రానా “స్కూల్ యూనిఫాం”కు ఏ రకంగా విఘాతం కలుగుతుందో ఇప్పటికీ హిజాబ్ ను వ్యతిరేకించేవారికి ఓ క్లారిటీ లేని అంశమే. 


కాబట్టి భిన్న మతాల, సంస్కృతులకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఒక చోట చదివేటప్పుడు వారి వారి మతాలకు చెందిన చిహ్నాలనో, సంస్కృతినో అనుసరించుకుంటూనే అందరూ ఒకే రకమైన యూనిఫాంతో స్కూలుకు రావచ్చా? రాకూడా? అన్న ఒక్క పాయింటు తప్ప వేరే ఏ పాయింట్ పై డిస్కస్ చెయ్యటమైన కోర్టు తన విలువైన సమయాన్ని నష్టపరచుకోవటమే అవుతుంది.  


అయితే “భిన్న మతాలకు చెందిన విద్యార్ధులు తమ తమ మతపరమైన చిహ్నాలను, సంస్కృతులను పాటిస్తూనే స్కూలుకు వస్తున్నప్పుడు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరిస్తూనే యూనిఫాంలో రావటంలో తప్పేముంది? అన్న ప్రశ్నను ఇప్పుడు దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. కనీస లాజిక్ ఉన్నోళ్లెవరైనా తప్పులేదనే చెబుతారు.  

కానీ ఈ ప్రశ్నకు “తప్పులేదు” అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫాసిస్టు ప్రభుత్వాలుండే దేశాల్లో అలాంటి న్యాయమైన తీర్పులకు అవకాశం ఉండదు కాబట్టి. అందుకే ఎవరూ ఊహించని విధంగా “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అనే ఓ కొత్తరకమైన తీర్పును వినాల్సి వచ్చింది. 


పోనీ, కోర్టు “మేము ఖురాన్, హదీసులు పూర్తిగా స్టడీ చేసి “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అని ఫలానా చోట కనుగొన్నాము? అని ఆధారసహితంగా చెబుతుందా? అంటే కాదు కదా. ఎందుకంటే అలాంటి స్టేట్మెంట్ ఖురాన్, హదీసుల్లో ఎక్కడా భూతద్దం పెట్టి వెదికినా దొరకదు. 


మరి కోర్టు దేని ఆధారంగా “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదని” తీర్పివ్వగలిగింది? అన్నదే అస్సలు అర్థం కాని పాయింట్.   


“అబ్బే ఖురాన్, హదీసుల్లో ఎక్కడా అలాంటి స్టేట్మెంట్ లేదు, కాకపోతే ఖురాన్ లో ఎక్కడా హిజాబ్ ధరించమని రాసి లేదు కదా! అందుకు ఆ రకమైన తీర్పు చెప్పాల్సి వచ్చిందంటే.. అది అస్పష్టమైన ఆధారాలతో ఇచ్చిన తీర్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. 


ఎందుకంటే ఖురాన్ స్పష్టంగా "విశ్వాసులైన స్త్రీలు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడదీసుకోవాలి 33:59" అని ఆదేశిస్తుంది. అచ్చం ఇలాంటి ఆదేశమే ఖురాన్ 24:31 లో “స్త్రీలు తలపై నుండి ఛాతీ వరకు వస్త్రాన్ని ధరించాలి” అని స్పష్టంగా మరో చోట కూడా చెబుతుంది. దీనినే సామాన్య పరిభాషలో ‘హెడ్ స్కాఫ్’ అంటారు. అలాంటప్పుడు “ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లామిక్ విశ్వాసంలో అవసరమైన మతపరమైన ఆచారం కాదు” అని చెప్పటం ఎంతవరకు అవగాహనాసహితమైన తీర్పన్నది విజ్ఞత కల పాఠకులే ఆలోచించాలి. 


“అవునండీ! కచ్చితంగా ముస్లిం స్త్రీలు హిజాబ్ ధరించాల్సిందే’ అని ఖురాన్ గట్టిగా చెప్పటం లేదు కదా? అని కొందరు ప్రశ్నించవచ్చు. ఖురాన్ దేన్నైనా ఆదేశిస్తుందే తప్ప కచ్చితంగా పాటించాల్సిందే అని బలవంత పెట్టదు. స్వయంగా ఖురానే “ధర్మంలో ఎటువంటి బలవంతమూ లేదు” అని చెబుతుంది. 


కాబట్టి, భిన్న మతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు తమ తమ మతాచారాలను బట్టి బొట్లు, తిలకాలు, నామాలు పెట్టుకొచ్చినా, లాకెట్లు వేసుకొచ్చినా, జంధ్యం వేసుకొచ్చినా, టర్బన్ చుట్టుకొచ్చినా, హిజాబ్ చుట్టుకొచ్చినా అందరూ యూనిఫాంతో  స్కూల్ కు రావచ్చా? రాకూడదా? అన్న అంశంపై చర్చ చెయ్యటం, తీర్పు ఇవ్వటమే ప్రస్తుతం అవసరమైనది. తప్పితే ఏ యే మతాచారాలు ధార్మిక గ్రంథాల్లో రాసి ఉన్నాయి? ఏవి రాసి లేవు? అన్నది తేల్చటం కోర్టు పని కాదు. పైగా అలాంటి పనులు ఉన్నత న్యాయస్థానాలకు ఎంతమాత్రం శోభించవు కూడా.       


Md Nooruddin

missionary

 missionary

[ mish-uh-ner-ee ]

See synonyms for: missionary / missionaries on Thesaurus.com

📙 Middle School Level

noun, plural mis·sion·ar·ies.Also mis·sion·er for 1-3 .

a person sent by a church into an area to carry on evangelism or other activities, as educational or hospital work:

There are opportunities for student missionaries living abroad to work with the poor, participate in building projects, and share the Gospel.

a person strongly in favor of a program, set of principles, etc., who attempts to persuade or convert others.

a person who is sent on a mission.

SEE MORE

adjective

pertaining to or connected with religious missions.

engaged in such a mission or devoted to work connected with missions.

reflecting or prompted by the desire to persuade or convert others:

the missionary efforts of political fanatics.

characteristic of a missionary:

missionary zeal.

relating to or noting the missionary position:

Then it was up to the bedroom for some good, old-fashioned missionary sex.


‘హిజాబ్‌’ న్యాయం

 ‘హిజాబ్‌’ న్యాయం

Mar 16 2022 @ 00:25AMహోంఎడిటోరియల్సంపాదకీయం

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న హిజాబ్ ధారణ వివాదంలో ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ప్రకటించిన తుది తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ ధరించడం తప్పనిసరి మతచారాల్లోనికి రాదని నిర్థారించడంతో పాటు, విద్యాసంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ వస్త్రధారణపై విధించిన నిషేధాన్ని సైతం కోర్టు సమర్థించింది. ఆయా విద్యాసంస్థలు నిర్దేశించే నియమావళికి అక్కడి విద్యార్థులంతా కట్టుబడవలసిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టును తేల్చనివ్వండి అని గతంలో వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఏం చెప్పబోతున్నదో చూడాలి.


రాష్ట్ర హైకోర్టులో ఒక న్యాయమూర్తితో ఆరంభమై, త్రిసభ్యధర్మాసనానికి విస్తరించి, పదకొండురోజులు వాదోపవాదాలు సాగి, ఇరవైరోజుల క్రితం తీర్పును రిజర్వుచేసిన న్యాయస్థానం ఇప్పుడు దానిని ప్రకటించింది. అది తమ ఆశలను వమ్ముచేయనందున, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇకనైనా బుద్ధిగా చదువుకోండి అని పిటిషనర్లకు హితవు చెబుతున్నారు. ఈ తీర్పు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను, మతస్వేచ్ఛను కాదనేట్టుగా ఉందని, ఏ వివక్షలూ లేకుండా విద్యను అభ్యసించగలిగే అవకాశాన్ని కొందరికి దూరం చేసేట్టుగా ఉందని మరికొందరు అంటున్నారు. ఇక, హిజాబ్ మతప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం, విద్యాసంస్థల యూనిఫామ్ నియమానికి విద్యార్థులు కట్టుబడాల్సిందేనని చెప్పడం, విద్యాసంస్థలకు మద్దతుగా కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎత్తిపట్టడం ద్వారా హైకోర్టు ప్రధానంగా ఈ తరహా ఉమ్మడి స్థలాల్లో అక్కడి నియామాలకు ఎవరైనా కట్టుబడి వ్యవహరించాల్సిందేనని నిర్దేశించినట్టు భావించాలి. 

హిజాబ్ మతప్రాధాన్యం మీద ఒక ధర్మాసనం విస్తృతంగా లోతుగా వ్యాఖ్యానించడం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. అది ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఎంతో ముఖ్యమైనదీ, ప్రాథమికమైనదీ అన్న వాదనపైనే పిటిషనర్లు ఈ కేసులో ప్రధానంగా ఆధారపడ్డారు. తరగతిగదిలో దానిని కొద్దిగంటలు పక్కనబెట్టవలసి వచ్చినా తమ మతవిశ్వాసాలకు విఘాతం కలుగుతుందనీ, అలాగే, రాజ్యాంగం 19, 25 అధికరణల ద్వారా తమకు దఖలుపరచిన హక్కులను దక్కనీయకుండా చేయడం అవుతుందని వారి వాదన. హిజాబ్ వినియోగం మౌలికమని ఇస్లామిక్ మత గ్రంధాలు చెప్పలేదనీ, అది కాలానుగుణంగా ఒక సంప్రదాయంగా వచ్చిచేరిందనీ, ఈ పిల్లలమాటలను విని న్యాయస్థానం దానికి మత ప్రాధాన్యం ఉన్నదని గానీ అంటే, ఇకపై ప్రతీ ముస్లిం మహిళా దానిని విధిగా పాటించవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మొత్తం వివాదాన్ని నాలుగు ప్రధాన అంశాలుగా పరిష్కరించిన న్యాయస్థానం, ఈ వ్యవహారంలో పిటిషనర్లు చెప్పినవారిపై చర్యలుతీసుకొనేందుకు కానీ, దర్యాప్తులు జరిపించేందుకు కానీ అంగీకరించలేదు. పైగా, విద్యాసంవత్సరం మధ్యలో ఈ వివాదం ఎలా పుట్టుకువచ్చిందని అనుమానపడటం, అసాంఘికశక్తుల ప్రమేయం ఉన్నదేమోనని వ్యాఖ్యానించడం విశేషం. 

రాజ్యాంగం దఖలు పరచిన హక్కుల వెలుగులో, తరగతి గదిలో హిజాబ్ ధరించడం మతపరంగా కీలకమైనదేనా? అన్న అంశాన్ని పరిశీలించదలచిన న్యాయస్థానం తన మధ్యంతర ఉత్తర్వుల్లో సైతం తుదితీర్పు వెలువడేవరకూ ఎవరూ తమతమ మత చిహ్నాలు ప్రదర్శిస్తూ విద్యాప్రాంగణాల్లోకి ప్రవేశించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి ఉపకరించినప్పటికీ, కొందరు న్యాయనిపుణులు దీనిని సమర్థించలేదు. వాదనలు వినకుండానే న్యాయమూర్తులు తీర్పు చెప్పేశారని అన్నారు. ఇక, హిజాబ్ మత ప్రాధాన్యం విషయంలో పిటిషనర్ల వాదనను కాదన్నప్పటికీ, వారి ప్రాధమికహక్కులను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం తీర్పు వెలువడవచ్చునని కొందరు వేసిన అంచనాలు కూడా ఇప్పుడు తప్పాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో, రేపు ఇతర మతాలవారూ తమ ఆహార్యం విషయంలో పరిమితులు ఎదుర్కోవలసి రావచ్చు. ‘ప్రోటోకాల్’ విషయంలో విద్యాసంస్థల హక్కును సమర్థించడం బాగున్నది కానీ, యూనిఫామ్ సహా పలు నడవడికల విషయంలో ఇప్పటివరకూ ఏ ఆంక్షలూ నియమాలూ లేని సంస్థలు రేపు నయానో భయానో వాటిని రుద్దవలసి రావచ్చు. ఉమ్మడిగా, అన్ని మతాలవారితో కలసి చదువుకోవాల్సిన వారు విధిలేక మతవిద్యాసంస్థల్లో చేరవలసిన అగత్యం ఏర్పడవచ్చు. కీలకమైన, సున్నితమైన ఈ అంశాన్ని దేశ సర్వోన్నతన్యాయస్థానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Monday 14 March 2022

hijab ధరించడం మతపరమైన ఆచారం కాదు - కర్ణాటక హైకోర్టు

 hijab ధరించడం మతపరమైన ఆచారం కాదు...


ఉడిపి కాలేజీ అమ్మాయిల పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు


Mar 15 2022 @ 11:03AMహోంజాతీయం


VDO.AI

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది.‘‘ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’’ అని హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పులో పేర్కొంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్ అని, దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది.హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10వతేదీ హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వతేదీన తీర్పును రిజర్వ్ చేసింది. పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. కౌంటర్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది.దీంతో కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. కాగా కర్ణాటక హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.