ఎర్రచందనం దోంగలో చైనా వర్కర్స్.....
ఎర్రచందనం దొంగలు అంతర్జాతీయంగా ఉన్నట్టున్నారు. చైనాలోనూ ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉంది. బహుశా అందుకే బెంగుళూరులో రెడ్‌శాండల్‌ను అక్రమంగా నిల్వచేసి దొంగచాటుగా ఫ్యాక్టరీని కూడా నడుపుతున్న నలుగురు చైనీయులను పోలీసులు అరెస్టు చేశారు. 10లక్షల విలువైన యంత్ర సామాగ్రితో సహా ఆరు టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైనాలో రెడ్‌శాండల్‌కు చాలా డిమాండ్ ఉందని కర్నాటక ఐజీపీ అరుణ్ చక్రవర్తి తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనాన్ని దాచి ఈ చైనా వాళ్ళు తమ దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నారని తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. వీళ్ళు దీన్ని రోడ్డు మార్గం ద్వారా బెంగుళూరు విమానాశ్రయానికి చేర్చి, అక్కడి నుంచి విమానంలో చైనాకు పంపుతున్నారని, ఎర్ర చందనం అక్రమ రవాణాలో చైనీయులు పట్టుబడడం ఇదే మొదటిసారని అరుణ్ చక్రవర్తి అన్నారు.
No comments:
Post a Comment