|
విజయవాడ, ఏప్రిల్ 29 : కనకదుర్గ ఆలయంలో బంగారు కిరీటం, నగలు దోచుకున్న గజదొంగ ప్రకాష్ సాహూను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంకలోని ఓ లాడ్జిలో సాహూ మకాం వేశాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో 40 కిలోల వెండి సామాగ్రిని దోచుకున్నాడు. సీసీ కెమెరా చిత్రాలు, క్లూస్‌టీమ్ ఆధారంగా అది సాహూ పనిగా పోలీసులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్ బిలాయికి చెందిన సాహూ ఎలక్ర్టిషన్‌గా పనిచేశాడు. తెలుగు రాష్ర్టాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ఆలయాల్లో సాహూ భారీ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
|
No comments:
Post a Comment