Thursday, 15 October 2015

అజిత్‌ దోవల్‌ ....

అజిత్‌ దోవల్‌ ....
భారత సైన్యం దూకుడు వెనుక సూత్రధారి..
పాక్‌ ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి...సింహస్వప్నం
....
దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాదులను మట్టుబెట్టే దూకుడు..పాక్‌-భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి. అతనే భారత జాతీయ భద్రత సలహాదారు, ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ కుమార్‌ దోవల్‌‌. ఐబీ డైరెక్టర్‌గా పనిచేసిన దోవల్‌ అపర చాణక్యుడిగా పేరొందారు. డోవల్‌ పేరు భారత్‌కన్నా పాక్‌లోనే సుపరిచితం. భారత జాతీయ భద్రత సలహాదారుగా ఆయన ఎంపికైనప్పుడు ‘పాక్‌ను విచ్ఛిన్నం చేయడానికి నియమితుడైన భారతీయుడు’ అంటూ పాక్ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. దోవల్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు మోస్ట్‌వాంటెడ్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం పాక్‌నుంచి ఆఫ్ఘన్‌కు మకాం మార్చాడు. పాక ఆక్రమిత కాశ్మీర్ లో భారత అనుకూల ఉద్యమాలు మొలైయాయి. పంజాబ్‌, మిజోరం, కశ్మీర్‌లలో గూఢచారిగా ఉగ్రవాదుల నుంచి అనేకసార్లు దేశాన్ని రక్షించిన ఘనత ఆయన సొంతం. పాక్‌లోనూ ఏడేళ్లు అండర్‌ కవర్‌ గూఢచారిగా ఆయన పనిచేశారు. మోదీకి దోవల్‌ సన్నిహితుడు. సంఘ్‌ మేధోవర్గంలో ఒకరుగా ముద్రపడిన దోవల్‌ మోదీకి అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. పాక్‌ ఉగ్రవాదుల గుండెల్లో డెవిల్‌గా ముద్రపడిన దోవల్‌ సైనికులకు మాత్రమే దక్కే కీర్తిచక్ర అవార్డు పొందిన తొలి ఐపీఎస్‌ అధికారి. శ్రీలంక ఎన్నికల్లో మహింద రాజపక్షే ఓటమి వెనుక దోవల్‌ చాణక్యనీతి ఎంతో ఉంది. ‘‘నాకు దేశమే ముఖ్యం.. దేశం కోసం అవసరమైతే హింసను ఆశ్రయించడంలో తప్పులేదు’’ ఇదీ దోవల్‌ సిద్ధాంతం. అయన ప్రతి భారతీయునికి ఆదర్శమూర్తి కావాలని కోరుకుంటూ..

No comments:

Post a Comment