న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఉత్తరప్రదేశ్ దాదరీ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సమస్యను భారత్‌లోనే పరిష్కరించుకోగలిగే పరిస్థితి ఉన్నా ఐక్యరాజ్యసమితి దృష్టికి అనవసరంగా తీసుకెళ్లారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పంతా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానిదేనన్నారు. ముస్లింలకు భద్రత కల్పించలేకపోతున్న అఖిలేష్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందన్నారు. యూఎన్ జనరల్ సెక్రటరీకి లేఖ రాసిన ఆజం భారత్‌లో ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇరాక్, సిరియాలకన్నా ఘోరంగా ఉందని చెబుతూ జోక్యం చేసుకోవాలని బాన్‌కిమూన్‌ను కోరారు. ఆజం ఖాన్ చర్య ప్రమాదకరమైందని ఒవైసీ చెప్పారు. దాద్రీలో గోవును అపహరించి చంపి తిన్నారనే ఆరోపణలపై అఖ్లాక్ అనే వ్యక్తిని చంపేశారు.
Tuesday, 6 October 2015
ఆజం ఖాన్ తప్పు చేశాడు: ఒవైసీ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment