Sunday, 25 October 2015

హిందూత్వ - ప్రతిఘటన

హిందూత్వ - ప్రతిఘటన



కారణం

నాతో సహా, కమ్యూనిస్టులు , లౌకికవాదులు, ప్రజాస్వామికవాదులు, ఉదారవాదులు, దళితవాదులు, మతఅల్పసంఖ్యాకవాదులు వగయిరావగయిరా అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ సగభాగం హిందూత్వ వుంది. మనందరి ఉదాసీనతవల్లే దేశంలో హిందూత్వ కొండలా పెరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.. ఇప్పుడు వివాదం అర్ధ హిందూత్వవాదులకూ, సంపూర్ణ హిందూత్వవాదులకు మధ్యనే.

పరిష్కారం 

మనలో సగభాగంగావున్న హిందూత్వను త్యజించకుండా సంపూర్ణ హిందూత్వగా మారిన అధికారిక సమూహాన్ని, రాజ్యాన్ని ఎప్పటికీ ఎదుర్కోలేము.

ప్రజలు ఎలా పోరాడాలో రాజ్యమే చెపుతుంది. మనం ఏం చేయాలో మన శత్రువే చెపుతాడు.


ఏం చేయాలీ ?

రాజ్యము మాట్లాడవద్దన్నది మనం మాట్లాడాలి
రాజ్యము రాయవద్దన్నది మనం రాయాలి
రాజ్యము చేయవద్దన్నది మనం చేయాలి

అప్పుడు మాత్రమే మనం పరిష్కారం దిశగా కదలగలుగుతాము. విజయం అనేది చాలా సుదూర ప్రయాణం.

శత్రువుతో తమకు ఘర్షణ మాత్రమే వుందని చాలామంది నమ్ముతుంటారు. నిజానికి మనకు మన శత్రువుతో ఐక్యత కూడా వుంటుంది.


(ప్రజాస్వామిక రచయితల వేదిక, ’వర్తమాన సామాజిక సంక్లిష్టతలు రచయితల బాధ్యతఅనే అంశంపై 25-10-2015 ఆదివారం, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ లో నిర్వహించిన చర్చాగోష్టిలో నా అతి సంక్షిప్త ప్రసంగం)

No comments:

Post a Comment