Thursday, 15 October 2015

మాదేశంలో భారత్ ఉగ్రచర్యలకు సాక్ష్యాలివిగో: పాక్

మాదేశంలో భారత్ ఉగ్రచర్యలకు సాక్ష్యాలివిగో: పాక్
Updated :16-10-2015 12:07:31
కరాచీ, అక్టోబరు 16: తమ భూభాగంలో దాయాది దేశం భారత్ ఉగ్రదాడులకు పాల్పడుతోందంటూ ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ సాక్ష్యాలందించింది. భారత్ సహాయ సహకారాలతో తమ దేశంలో ఉగ్రవాదులు విజృంభిస్తున్నారని పాక్ ఆరోపించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలంటూ మూడు ఫైళ్లను ఐరాసకు అందించింది. కరాచీ, బెలూచిస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక తెహ్రీక్-ఇ-తాలిబన్ సంస్థకు భారత్ నుంచి నిధులు అందుతున్నాయని పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి ఖలీలుల్లా పేర్కొన్నారు. తమ దేశాన్ని అన్ని విధాలుగా అస్థిరపరిచేందుకు భారత్ కుట్రపన్నుతోందని, పరోక్ష యుద్ధం చేస్తోందని, మరోవైపు పాకిస్తాన్‌పైనే ఆరోపణలు చేస్తోందని అన్నారు. దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment