Thursday, 15 October 2015

తమరి ‘గోధ్రా అనంతర’ చరిత్ర మరిచారా?: శివసేన

తమరి ‘గోధ్రా అనంతర’ చరిత్ర మరిచారా?: శివసేన
Updated :15-10-2015 01:41:11
ముంబై, అక్టోబరు 14: ముంబైలో పాక్‌ గాయకుడు గులాం అలీ సంగీత కచేరీ తమ వ్యతిరేకతతో రద్దు కావడంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోధ్రా అనంతరం అల్లర్లకు మోదీ ప్రతీకగా నిలిచిపోయిన వాస్తవాన్ని గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేసింది. ఈ మేరకు బుధవారం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబైలో విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ ఉజ్వల రాజకీయ జీవితంలో 2002నాటి అల్లర్లు ఎన్నటికీ మాయని మచ్చ. దాంతోపాటు అహ్మదాబాద్‌లో హింసాత్మక సంఘటనలతోనే ఆయన ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు. అలాంటి నరేంద్ర మోదీ ఇప్పుడు గులాం అలీ వివాదాన్ని దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించడం మనందరికీ దురదృష్టకరం’’ అని విరుచుకుపడ్డారు.
 
మరోవైపు మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో గురువారం ముంబైలో బీజేపీ మంత్రులు, పార్టీ నేతల భేటీ జరగనుంది. అయితే, ఈ సందర్భంకన్నా పక్కలో బల్లెంగా మారిన శివసేనను వదిలించువడంపైనే చర్చ కేంద్రీకృతం కావచ్చునని సమాచారం. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమంటూ శివసేన ఇప్పటికే సంకేతాలు పంపినా, మరోసారి ఎన్నికలకు వెళ్లే సాహసం ఎవరూ చేయరని, ప్రభుత్వం నుంచి సేన వైదొలగే అవకాశాలు లేవని విద్యాశాఖ మంత్రి వినోద్‌ తావ్డే అన్నారు

No comments:

Post a Comment