వింతైన హెయిర్‌కటింగ్ చేస్తారు.. సింపుల్‌గా వండుకుతినేస్తారు! Updated :19-10-2015 17:12:49 |
కరాచీ: ఎడారి ఓడ అని ముద్దుగా పిలుచుకునే ఒంటెలను వాళ్లు ఎంతోగానో ముస్తాబు చేస్తున్నారు. వాటి కోసం సెలూన్ కూడా పెట్టేశారు. సెలూన్ అంటే షాప్ కాదులెండి. ఆరుబయటే వాటి జుట్టును కట్ చేస్తున్నారు. పశువుల కాపరులే అక్కడ హెయిర్ స్టయిలిస్టులు. ఒంటెల ఒంటిపై ఉన్న జుట్టును వింత వింత డిజైన్లలో కట్ చేస్తున్నారు. ఇదంతా ఏదో ఉత్సవంలో ఆడించేందుకు చేస్తున్నారనుకునేరు. ఎంతో అందగా ముస్తాబు చేసిన ఒంటెలను కూరొండుకు తినేవారికి అమ్మేస్తారట. హెయిర్ స్టయిల్ ఎంత బాగుంటే.. అంత ఎక్కువ రేటు పలుకుతాయట. ఒక్కో ఒంటెను డిజైన్ చేసేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతుందట. మాములు వాటికన్నా హెయిర్ స్టయిల్ చేసిన ఒంటెలు 10 నుంచి 15 వేల దాకా ఎక్కువ రేటు పలుకుతాయట. ఇంతకీ ఇదంతా ఎక్కడో చెప్పనే లేదు కదూ.. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న పశువుల సంతల్లో. అక్కడున్న పశువుల సంతలను చూస్తే.. ఒక్కో హెయిర్ స్టయిలిస్ట్ ఒక్కో ఒంటెతో కుస్తీ పడుతున్నట్టు ఉంటుంది. కూర వండుకుని తినేందుకు ఇంత అలంకరణ ఎందుకో వారికే తెలియాలి.
|
No comments:
Post a Comment