ముస్లింల స్థితిగతులపై విచారణ Updated :16-10-2015 12:10:59 |
ముస్లిం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్టు ముస్లిం స్థితిగతులపై నియమించిన విచారణ కమిషన్ చైర్మన్ జి.సుధీర్ తెలిపారు. గురువారం జిల్లా సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల ముస్లిం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విచారణతోపాటు క్షేత్రస్థాయిలో సందర్శించనున్నట్టు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితులు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను, రుణాలు పొందడలంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాకలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో 50నుంచి 55శాతం ముస్లింలు నివసిస్తున్నారని, ఈ కమిటీ ద్వారా నమోదు చేసిన విషయాలను ప్రభుత్వానికి నివేదికను సమర్పించడంతో పాటు కమిషన్ సూచనలు, సలహాలు ఇస్తుందన్నారు. 16న తాండూరులో పర్యటించి, ప్రజల సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకుని, ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపడుతుందన్నారు. మరో పది రోజుల్లో ఈ కమిటీ జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు అంశాలను కమిషన్ దృష్టి తెచ్చారు. ఉర్దు అధ్యాపకుల నియామకం, మహిళలకు చిన్న పరిశ్రమలు ఏర్పాటుకు ఆర్థికసహాయం, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ కార్య్రమంలో కమిటీ సభ్యులు అబ్ధుల్ భారీ, జడ్పీ సీఈవో రమణారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎం.ఎ.రషీద్, మైనారిటీ సంక్షేమాధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. |
No comments:
Post a Comment