భిన్న దృక్పథాల మధ్య చర్చ జరగాలి
31-08-2019 02:21:52
భిన్నాభిప్రాయాలకు చోటు ఉండాలి
నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తా..
‘మనోరమ’ సదస్సులో మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 30: నిర్మాణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన కోచిలో మలయాళ మనోరమ నిర్వహిస్తున్న ‘న్యూస్ కాంక్లేవ్’ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను తనలాగా ఆలోచించే వ్యక్తుల మధ్య సౌకర్యంగా ఉంటానని, అదే సమయంలో భిన్న దృక్పథాల వ్యక్తుల మధ్య చర్చ జరగాలని కోరుకుంటానని చెప్పారు. దేశంలో చాలా మార్పులు వచ్చాయని, యువత ఇంటి పేరు తోకను పట్టించుకోవడం లేదని, తమ పేరు నిలబెట్టుకోవడానికి సామర్థ్యాన్నే నమ్ముకుంటున్నారని అన్నారు.
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
Supermoon - Ft. Russell Peters World Tour.
Pune | Ahmedabad | Hyderabad Oct 1st - Oct 6th
Book Now
‘ఆయు్‌ష’కు ప్రామాణికత తెస్తున్నాం
వేల సంవత్సరాల క్రితమే భయంకర వ్యాధులకు చికిత్స చేసిన చరిత్ర భారతదేశానికి ఉందని, నాటి వేద విజ్ఞానాన్ని నేటి పరిస్థితులకు అనుసంధానం చేయడంలోనే విఫలమవుతున్నామని మోదీ అన్నారు. సంప్రదాయ, ఆధునిక వైద్య విధానాలను మేళవిస్తేనే దేశ వైద్య వ్యవస్థ కొత్తరూపు సంతరించుకుంటుందని చెప్పారు. పురాతన వైద్య పరిజ్ఞానాన్ని పరిశోధనాలయాల్లో పరీక్షిస్తూ, ఆధునిక శాస్త్ర పునాదులు కల్పించే కార్యక్రమం ఐదేళ్లుగా సాగుతోందని వెల్లడించారు. శుక్రవారం ఆయన హరియాణాలో పది ఆయుష్ కేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షన్నర ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. వాటిలో ఆయుష్ వైద్య విధానాలకు కూడా చోటు ఉంటుందని చెప్పారు. విడిగా మరో 12000 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
5-10 నిమిషాలు యోగాపైనే చర్చ
ప్రపంచంలో తనను కలిసిన ప్రతీ దేశాధినేతా తనతో కనీసం 5-10 నిమిషాలు యోగా గురించి మాట్లాడారని మోదీ చెప్పారు. ఈసారి భూటాన్‌కు వెళ్లినపుడు మాత్రం తను పాల్గొన్న ‘‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’’ టీవీ కార్యక్రమం గురించే ఎక్కువగా అడిగారని నవ్వుతూ అన్నారు. ప్రపంచమంతా భారత యోగ విద్య గురించి నేర్చుకోవాలని అనుకుంటోందన్నారు.
రోజుకో పదం నేర్వండి ప్రధాని సవాల్... స్వీకరించిన థరూర్
భారతదేశాన్ని ఏకం చేయడానికి భాషను పనిముట్టుగా వాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వార్థపర శక్తులు దేశాన్ని విడదీయడానికి భాషను ఉపయోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభిన్న భాషల ప్రజల మధ్య మీడియా అనుసంధానంగా పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. రోజుకో పదం చొప్పున పరాయి భాషా పదాన్ని మీడియా ప్రచురించాలని కోరారు. అప్పుడు సంబంధిత భాషా ప్రజలు ఏడాదిలో 300కి పైగా పరాయి భాషా పదాలను నేర్చుకుంటారని చెప్పారు. తమ మాతృభాష కాకుండా మరో భారతీయ భాషను నేర్చుకుంటే మన భిన్నత్వంలోని ఏకత్వాన్ని అర్థం చేసుకోగలరన్నారు. ప్రధాని భాషా సవాల్‌ను మలయాళ మనోరమ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్వీకరించారు. ఇక నుంచి తాను రోజూ ఇంగ్లిష్, హిందీ, మలయాళంలో ఒక పదాన్ని ట్వీట్ చేస్తానన్నారు. ప్లూరలిజం, బహుళవాద్, బహువాచానం అంటూ మూడు భాషల్లో బహుళవాదాన్ని ట్వీట్ చేశారు.

No comments:
Post a Comment