'100వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఇండియాలో కశ్మీర్ ఉండదు'
13-08-2019 08:45:04
చెన్నై: కశ్మీర్‌పై ఎండీఎంకే చీఫ్ వైకో సంచలన వ్యాఖ్య చేశారు. భారతదేశం నూరవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి కశ్మీర్ ఇండియాలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
‘‘దేశం నూరవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే సమయానికి భారత్‌లో కశ్మీర్ ఉండదు. వాళ్లు (బీజేపీ) కశ్మీర్‌పై బురద చల్లారు. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం చెప్పాను. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ని నేను 30 శాతం తప్పుపడితే, బీజేపీని 70 శాతం తప్పుపడతాను’’ అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. డీఎంకే వ్యవస్థాపకుడు, 'అన్నా' పేరుతో ఆప్యాయంగా పిలిపించుకునే దివంగత ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై 110 జయంత్యుత్సవాలను ఒక రోజంతా తమ పార్టీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో సెలబ్రేషన్స్ ఉంటాయని, ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న స్టేజ్, గ్రౌండ్ పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చానని వైగో చెప్పారు.

No comments:
Post a Comment