ఎన్ఆర్‌సీ జాబితాలో లేని మాజీ రాష్ట్రపతి కుటుంబీకుల పేర్లు
31-08-2019 19:27:31
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన అసోం ఎన్ఆర్‌సీ జాబితాలో భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఫకృద్దీన్ అలీ అహ్మద్ కుటుంబసభ్యుల పేర్లు చోటుచేసుకోలేదు. తుది జాబితాలో మొత్తం 19 లక్షల మందికి పైగా స్థానం కోల్పోయారు.
ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ భారత దేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుంచి 1977 వరకూ పనిచేశారు. ఫకృద్దీన్ సోదరుని కుమారుడు జియాఉద్దీన్ అలీ అహ్మద్ పేరు ఎన్ఆర్‌సీ తుది జాబితాలో చోటుచేసుకోలేదు. దీనిపై జియావుద్దీన్ మాట్లాడుతూ, తన పేరు ఎన్ఆర్‌సీ జాబితాలో లేదని, తన తండ్రి పేరు 'లెగసీ డాటా'లో చేటుచేసుకోకపోవడం తమకు బాధ కలిగించిందని చెప్పారు.

No comments:
Post a Comment