ఐరాస దృష్టికి కశ్మీర్ వ్యవహారం.. కీలక సూచనలు!
06-08-2019 17:15:23
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనకు గల కారణాలను వివరించింది. ఈ చర్యలు కశ్మీర్‌లో సుపరిపాలనకు దోహం చేస్తాయని ఐక్యరాజ్యసమితికి భారత్ వివరించింది. మరోవైపు భారత విదేశాంగశాఖ.. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్ పరిణామాలను తెలియజేసింది. కాగా, నియంత్రణ రేఖ వెంబడి భాగ్యస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని అగ్రరాజ్యం అమెరికా సూచించింది. కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి భారత్‌కు సూచించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా.. జమ్మూకశ్మీర్‌ను రెండుగా విడగొడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాయాది దేశమైన పాకిస్తాన్.. భారత ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఐరాసకు ఫిర్యాదు చేస్తామంటూ ఆదేశ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ప్రపంచ దేశాలు కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కశ్మీర్ అంశంపై స్పందించిన శ్రీలంక ప్రధాని విక్రమసింఘే.. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారం అని వ్యాఖ్యానించారు. లద్దాఖ్‌లో 70శాతం బౌద్దులే ఉన్నారని, భారత్‌లో బౌద్దులు మెజార్టీగా ఉన్న ప్రత్యేక ప్రాంతంగా లద్దాఖ్ ఉండనుందని పేర్కొన్నారు

No comments:
Post a Comment