కశ్మీర్, మహాత్ముడు, గాంధేయులు
17-08-2019 00:47:38
‘ప్రస్తుత సంక్షోభ సమయంలో మనం కశ్మీరీల పక్షాన నిలబడాలి. ఎందుకంటే కశ్మీరీల సంక్షోభం మన సంక్షోభం కూడా. భావ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రభుత్వం అనుమతించి తీరాలి. అది మాత్రమే పరిస్థితులను చక్క దిద్దడానికి తోడ్పడగలదని’ గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రకటన స్పష్టం చేసింది. చాలా కాలంగా గాంధీని అధ్యయనం చేస్తున్న వాడిగా, చరిత్రకారుడుగా కశ్మీర్‌లో ఇప్పుడు చోటుచేసుకుంటున్న విషాద సంఘటనలపై మహాత్ముడు ఏమనుకునే వారు అనేదానికి ఆ ప్రకటన పూర్తిగా అద్దం పట్టిందని సునిశ్చితంగా చెప్పగలను.
మహాత్మా గాంధీ 1947 ఆగస్టు మొదటి వారంలో కశ్మీర్ లోయను సందర్శించారు. అప్పుడు ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ప్రయాసతో కూడిన ప్రయాణమది. అయితే వ్యక్తిగత బాధ్యత, జాతీయ గౌరవమూ ఆయన్ని అక్కడకు తీసుకు వెళ్ళాయి. భారత్ మరి కొద్ది రోజుల్లో వలసపాలన నుంచి విముక్తమవనున్నది; అయితే రెండు దేశాలుగా విడిపోనున్నది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్‌లో చేరుతుందా లేక కొత్తగా ఆవిర్భవించే పాకిస్థాన్‌లో చేరనున్నదా అనే విషయమై స్పష్టత లేదు. కశ్మీర్ ప్రజల్లో అత్యధికులు ముస్లింలు. వారి నాయకుడు షేక్ అబ్దుల్లా పాకిస్థాన్‌ను తిరస్కరించిన సంపూర్ణ లౌకిక వాది. సంస్థాన పాలకుడు మహారాజా హరిసింగ్ హిందూ మతస్థుడు. ఆయన ఇటు భారత్‌లో గానీ, అటు పాకిస్థాన్‌లో గానీ చేరదలుచుకోలేదు. కశ్మీర్‌ను ఒక విధంగా ప్రాచ్య స్విట్జర్లాండ్‌గా తీర్చి దిద్దాలని హరిసింగ్ కలలుగంటున్నారు. గాంధీజీ రెండు లక్ష్యాలతో కశ్మీర్‌కు వెళ్ళారు.
ADVERTISEMENT
POWERED BY PLAYSTREAM
ఒకటి- షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడుదల చేసేలా మహారాజును ఒప్పించడం; రెండు- తమ భవిష్యత్తు విషయమై కశ్మీర్ ప్రజల మనో భావాలు తెలుసుకోవడం. కశ్మీర్ లోయలో మహాత్మునికి ఘన స్వాగతం లభించింది. శ్రీనగర్‌లో ప్రవేశించినప్పుడు వేలాది జనులు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. ‘మహాత్మా గాంధీకి జై’ అని ఆనందోత్సాహాలతో నినదించారు. జీలం నది వంతెనపై ప్రజలు కిక్కిరిసిపోవడంతో గాంధీ ఒక నావలో నదిని దాటారు. షేక్ అబ్దుల్లా సతీమణి నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయ వ్యవహారాలపై కాక, ఆధ్యాత్మిక అంశాలపై ఆయన హిందుస్థానీలో మాట్లాడారు. గాంధీజీతో పాటు కశ్మీర్ లోయకు వెళ్ళిన డాక్టర్ సుశీలా నాయర్ ఇలా రాశారు: ‘చుట్టుపక్కల గ్రామాల నుంచి స్త్రీ పురుషులు తండోప తండాలుగా మహాత్ముణ్ణి ప్రత్యక్షంగా చూడడానికి శ్రీనగర్‌కు తరలివచ్చారు. ఆయన ప్రజాకర్షణ శక్తి పట్ల మిత్రులు, శత్రువులు ఒకే విధంగా ఆశ్చర్య పోయారు. కేవలం ఆయన్ని స్వయంగా చూడడం ద్వారా అనేకానేక మంది ఎంతో ఉపశమనం పొందారు’
కశ్మీర్ లోయలో మూడు రోజులు, జమ్మూలో రెండు రోజులు గాంధీజీ గడిపారు తన కశ్మీర్ యాత్ర గురించి ఒక సంక్షిప్త నివేదికను నెహ్రూ, పటేల్‌కు ఆయన పంపించారు. మహారాజా హరి సింగ్, యువరాజు కరణ్ సింగ్‌తో తన సంభాషణల గురించి ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. ‘బ్రిటిష్ సార్వభౌమాధిపత్యం లుప్తమయిన క్షణం నుంచీ కశ్మీర్ ప్రజల సర్వ సమున్నత్వం ప్రారంభమవుతుందని మహారాజా, యువరాజు ఇరువురూ అన్నారు. భారత్‌లో చేరాలని తాము అభిలషిస్తున్నప్పటికీ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ నిర్ణయం వుంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష ఏమిటో ఎలా నిర్ణయిస్తారనే విషయమై మేము చర్చించలేదు.’
షేక్ అబ్దుల్లా జైలులో ఉన్నప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ ఇతర నాయకులు ఎలాంటి నిర్బంధంలో లేరు. మహాత్ముడు వారితో కూడా సమావేశమయ్యారు. ‘ఈ నాయకులు చాలా ఆశా భావంతో వున్నారు. ఎన్నికలు వయోజన వోటు హక్కు ప్రాతిపదికన జరిగినా లేక ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా జరిగినా భారత్‌లో చేరడానికి అనుకూలంగానే కశ్మీరీలు ఓటు వేస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు చెప్పారు. అయితే ముందు షేక్ అబ్దుల్లా, ఆయన సహ ఖైదీలను విడుదల చేయాలి...’ అని అన్నారని నెహ్రూ, పటేల్‌కు పంపిన నివేదికలో గాంధీజీ పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15న మహాత్ముడు న్యూఢిల్లీలో కాక, కలకత్తాలో వున్నారు. దేశ వ్యాప్తంగా హిందూ-ముస్లిం మత వైషమ్యాలు పెచ్చరిల్లిపోవడంతో ఆయన ఎంత మాత్రం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే మనస్థితిలో లేరు. తన సేవా భావం, నిరాహార దీక్షలతో కలకత్తాలో శాంతి సామరస్యాలను పునరుద్ధరించడంలో ఆయన సఫలమయ్యారు. న్యూ ఢిల్లీలో పరిస్థితులను చక్కదిద్దే ఆశాభావంతో ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు.
1947 సెప్టెంబర్‌లో షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడుదల చేశారు. మూడు వారాల అనంతరం పాకిస్థాన్, కశ్మీర్ పై దురాక్రమణకు పూనుకున్నది. ఆ రాష్ట్రాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడమే పాక్ లక్ష్యం. పాకిస్థాన్ దుర్నీతికి వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా ప్రజలను సమీకరించారు. దురాక్రమణదారులను వారు గట్టిగా ఎదుర్కొన్నారు. కశ్మీరీల ధైర్యసాహసాల గురించి విన్న గాంధీజీ 1947 అక్టోబర్ 29న ఢిల్లీలో ఒక ప్రార్థనా సమావేశంలో ఇలా అన్నారు: ‘కశ్మీర్‌ను మహారాజా కాపాడలేరు. కశ్మీర్‌ను కాపాడగలిగేవారు ఎవరైనా ఉంటే వారు ముస్లింలు, కశ్మీరీ పండిట్‌లు, రాజపుత్రులు, సిక్కులు మాత్రమే. ఈ వర్గాల వారు మాత్రమే కశ్మీర్‌ను రక్షించగలుగుతారు’. ఆయన ఇంకా ఇలా అన్నారు ‘ఈ సామాజిక వర్గాల వారందరితోనూ షేక్ అబ్దుల్లాకు ప్రేమాభిమానాలతో కూడిన స్నేహ సంబంధాలు ఉన్నాయి’. అబ్దుల్లా గురించి గాంధీజీ చాలా అర్థవంతంగా ప్రశంసించారు.
ఒక నెల అనంతరం భారత సైనిక దళాలు పాక్ దుర్రాకమణ దారులను వెనక్కి తరిమి కొట్టడంలో గణనీయమైన విజయాలు సాధించాయి, షేక్ అబ్దుల్లా ఢిల్లీకి వచ్చారు. 1947 నవంబర్ 28న ప్రార్థనా సమావేశంలో గాంధీజీ పక్కనే ఆయన కూర్చున్నారు. ప్రార్థన అనంతరం గాంధీజీ ఇలా అన్నారు: ‘షేక్ అబ్దుల్లా ఒక గొప్ప పని చేశారు. కశ్మీర్‌లో హిందువులు, సిక్కులు, ముస్లింలు అందరినీ సమైక్యంగా ఉంచారు. కలిసి జీవించాలని లేదా కలిసికట్టుగా చనిపోవాలనే ఆకాంక్షను వారిలో సుదృఢంగా నెలకొల్పారు’. 1948 జనవరి 30న ఒక హిందూ మతోన్మాది దురాగతానికి మహాత్ముడు బలయ్యారు. ఆ తరువాత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి ఎడతెగకుండా ప్రస్థానిస్తూనే వున్నది. రాజ్య అణచివేత చర్యలు, మతోన్మాదం ఈ భువిపై అత్యంత సుందర భూమి అయిన కశ్మీర్‌ను హింసాకాండతో అతలాకుతలమయిపోతున్న సీమగా మార్చివేశాయి.
గాంధీజీ గనుక జీవించివుంటే ఆయన బహుశా, కశ్మీర్ ఆధునిక చరిత్రలోని మూడు సంఘటనలకు ఎంతో తల్లడిల్లేవారు. అవి: 1953లో షేక్ అబ్దుల్లాను నెహ్రూ ప్రభుత్వం అరెస్ట్ చేయడం; 1989--–-90లో ఇస్లామిక్ జిహాదీలు కశ్మీర్ పండిట్‌లను ఊచకోతలు కోయడం; 2019లో మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిస్తున్న అధికరణ 370 ని రద్దుచేయడం. అధికరణ 370 రద్దు మహాత్ముడిని ఎంతైనా భీతి గొల్పి ఉండేదనడంలో సందేహం లేదు. ఆయన 150 వ జయంత్యుత్సవ సంవత్సరంలో ‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి’ భారత ప్రభుత్వం తిరస్కరించింది. పైగా కశ్మీర్ లోయను మానవాళి చరిత్రలోనే అత్యంత పెద్దదైన బహిరంగ బందీఖానాగా మార్చివేసింది.
కశ్మీర్‌లో వర్తమాన పరిణామాలపై వ్యాఖ్యానించడానికి గాంధీజీ మన మధ్య లేరు. అయితే ఆయన స్ఫూర్తితో సత్యం మాట్లాడుతున్న వారు కొందరు వున్నారు. శాంతి సామరస్యాల సాధన లక్ష్యంతో 1959లో ఏర్పాటై, ప్రశస్త సేవలనందించిన ‘గాంధీ పీస్ ఫౌండేషన్’ (జీపీఎఫ్) అనే స్వతంత్ర సంస్థ కశ్మీర్ పై ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది (లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌కు ఈ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన వలే ఈ సంస్థ కూడా అత్యవసర పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా, 1980లో తిరిగి అధికారానికి వచ్చిన ఇందిరాగాంధీ, జీపిఎఫ్‌ను అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారు).
హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలైన గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రకటన ఇలా పేర్కొంది: ‘ఆగస్టు 5న పట్టపగలే ఒక రాష్ట్రానికి రాష్ట్రమే దేశ పటం నుంచి పూర్తిగా అంతర్ధానమైపోయింది. భారత్‌లో ఇప్పుడు, 29కి గాను 28 రాష్ట్రాలు మాత్రమే వున్నాయి. ఇదేమీ అవాస్తవ, భ్రాంతి జనక విన్యాసాలు జరిగే ఇంద్రజాల ప్రదర్శన కాదు. మనం అత్యంత క్రూరమైన, వికృతమైన, అప్రజాస్వామిక మైన, అనుత్క్రమణీయమైన పరిణామాన్ని చూస్తున్నాం. ఇది మన ప్రజాస్వామిక రాజకీయాల భావ దారిద్ర్యాన్ని, అసంబద్ధతను వెల్లడించింది’. ఆ ప్రకటన ఇంకా ఇలా పేర్కొంది: ‘పార్లమెంటులో జరిగింది చర్చ కాదు, పరస్పరం అభిప్రాయాలు తెలుసుకోవడం ఎంత మాత్రం కాదు. ఒక సభ్యుడు అరిస్తే మరో మూడువందల మంది బల్లలను చరిచి చరిచి హర్షం వ్యక్తం చేశారు. మిగతావారు నిశ్చేష్టులై కృంగిపోయారు. అపజయానికి వెలవెల బోయారు’. గాంధీ పీస్ ఫౌండేషన్ ఇలా హెచ్చరించింది: ‘కశ్మీరీలను ఎల్ల కాలం ఇళ్ళలో బంధించలేము. తలుపులు తప్పక తెరుచుకుంటాయి. ప్రజలు తప్పక బయటకి వస్తారు. వారి ఆవేదన బాహాటంగా పెల్లుబుకుతుంది. ఆగ్రహావేశాలు బద్ధలవుతాయి. విదేశీ శక్తులు వారి మనస్సులను మరింత చురుగ్గా భారత్‌కు వ్యతిరేకంగా విషపూరితం చేస్తాయి. శాంతియుతంగా ఉండాలని, చట్ట బద్ధ పాలనకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన నాయకులందరినీ నిర్బంధించారు. చర్చలకు ఆస్కారం లేకుండా చేశారు’.
సామాన్య భారతీయులు, భారత ప్రభుత్వానికి ఉద్దేశించిన గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రకటన ఈ ఉద్బోధతో ముగిసింది: ‘ఈ సంక్షోభ సమయంలో మనం కశ్మీరీల పక్షాన నిలబడాలి. ఎందుకంటే కశ్మీరీల సంక్షోభం మన సంక్షోభం కూడా. వివేకవంతంగా ఆలోచించే భారతీయులందరూ తమ పక్షానే ఉన్నారన్న విషయాన్ని నిర్బంధంలో ఉన్న మన నిస్సహాయ సహచర భారతీయ పౌరులు తెలుసుకోవాలి. శాంతిభద్రతలను ప్రభుత్వం కాపాడాలి. అయితే భావస్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని అనుమతించి తీరాలి. అది మాత్రమే పరిస్థితులను చక్క దిద్దడానికి తోడ్పడగలదు’.
చాలా కాలంగా గాంధీని అధ్యయనం చేస్తున్న వాణ్ణిగా, ఆయన రచనలను ఔపోసన పట్టిన చరిత్రకారుడుగా గాంధీ పీస్ ఫౌండేషన్ ప్రకటన గురించి ఒక విషయాన్ని చెప్పగలను. కశ్మీర్‌లో ఇప్పుడు చోటుచేసుకుంటున్న విషాద సంఘటనలపై మహాత్ముడు ఏమనుకునేవారు అనేదానికి ఆ ప్రకటన పూర్తిగా అద్దం పట్టిందనేది నా సునిశ్చిత అభిప్రాయం. 1947లో గాంధీజీ అన్నమాటలను మరో సారి గుర్తు చేసుకుందాం: ‘షేక్ అబ్దుల్లా ఒక గొప్ప పని చేశారు. కశ్మీర్‌లో హిందువులు, సిక్కులు, ముస్లింలు అందరినీ సమైక్యంగా ఉంచారు. కలిసి జీవించాలని లేదా కలిసికట్టుగా చనిపోవాలనే ఆకాంక్షను వారిలో దృఢంగా నెలకొల్పారు’.
కశ్మీరీల రక్షకులం తామేనన్న విధంగా వ్యవహరిస్తున్న నేటి రాజకీయ మహారాజాలు కశ్మీరీలను కాపాడలేరు. వారి శ్రేయస్సుకు పూచీపడలేరు. ఈ రాజకీయ మహారాజాల అడుగులకు మడుగులొత్తే కార్పొరేట్ మహారాజాలూ కశ్మీరీలకు ఎలాంటి సంక్షేమాన్ని సమకూర్చలేరు. పాకిస్థాన్ సైన్యమూ వారి జిహాదీ ప్రతినిధులు కూడా కశ్మీరీలను రక్షించలేరు. దశాబ్దాలుగా ఈ జిహాదీల ప్రేరేపణతో అమాయక కశ్మీరీ యువకులు ఉగ్రవాద బాట పట్టి చిన్న వయస్సులోనే తమ జీవితాలను విషాదాంతం చేసుకోవడం జరుగుతోంది. కీలక భౌగోళిక ప్రాంతంలో ఉండి, విషాద చరిత్ర భారాన్ని మోస్తున్న కశ్మీర్ మరిన్ని దశాబ్దాల పాటు ఘర్షణలు, రక్తపాతానికి నెలవుగా ఉండవచ్చు. అయితే జాతి పిత ప్రబోధాలను మరచిపోని, తిరస్కరించని భారతీయులందరూ కశ్మీర్‌ను ఆ విషమ పరిస్థితి నుంచి రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వుండాలి. లక్ష్య పరిపూర్తి వరకు ఆ ప్రయత్నాలకు ఎలాంటి విరామం ఉండకూడదు. సంభాషణ, రచనలో సత్యసంధత; చర్చ, వాదనలో వివేచన; కార్యాచరణలో అహింస, నిత్య జీవితంలో మత సామరస్యరక్షణకు నిబద్ధత- ఈ ఆదర్శాలు, జీవనసూత్రాలను ఈ నిరాశామయ రోజుల్లో కూడా సజీవంగా, స్ఫూర్తిదాయకంగా ఉంచాలి.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

No comments:
Post a Comment