Tuesday, 6 August 2019

ఆర్టికల్ 370 రద్దు: చైనాకు భారత్ వార్నింగ్

ఆర్టికల్ 370 రద్దు: చైనాకు భారత్ వార్నింగ్
06-08-2019 20:57:59

న్యూఢిల్లీ: కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై చైనా స్పందించి, భారత్ చర్యను తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ విషయంలో భారత్ తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ చైనా విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. జమ్మూకశ్మీర్ విభజన, లద్ధాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమనే అంశం.. పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమనీ ఇందులో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడాన్ని ఏ మాత్రం అంగీకరించమని చైనాను హెచ్చరించింది.

ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోదన్న విదేశాంగశాఖ.. ఇతర దేశాల నుంచి కూడా అదే కోరుకుంటామని స్పష్టం చేసింది. కాగా.. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం సహా, కశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ప్రపంచదేశాలు .. ఈ నిర్ణయం భారత్ అంతర్గత వ్యవహారంగా పేర్కొన్నాయి. చైనా మాత్రం భారత్ చర్యను వ్యతిరేకించడంతోపాటు.. పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది.

No comments:

Post a Comment