మోదీ, అమిత్‌షాకు హ్యాట్సాఫ్: ఎంపీ విజయసాయి
05-08-2019 13:20:36
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు రాజ్యసభలో విజయసాయి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని ఆయన చెప్పారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు, జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు ఎందుకు ఉండాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి రెండు జాతీయ పతాకాలు ఎందుకు ఉండాలని నిలదీశారు. కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక పాకిస్థానీ భారత పౌరుడు ఎలా అవుతాడని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

No comments:
Post a Comment