Tuesday, 6 August 2019

పీవోకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పీవోకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
06-08-2019 19:24:25

న్యూ ఢిల్లీ: పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని.. పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. ఎవరి ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గదని.. రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శలు పట్టించుకోమన్నారు. నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కాంగ్రెస్‌పై షా విమర్శల గుప్పించారు. కశ్మీర్‌ విభజన బిల్లుపై లోక్‌సభలో అమిత్‌షా వివరణ సందర్భంగా పీవోకేపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోయలో ఉన్న వాళ్లంతా మన వాళ్లేనని.. వారి సంక్షేమం కోసం ఏం చేయాలో మేం చేస్తామన్నారు. పాకిస్థాన్‌ నుంచి ప్రేరణ పొందినవారితో చర్చలు జరపాలా?.. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్థానే కారణమని.. ఆ తొత్తులతో ఎలాంటి చర్చలు జరపబోమన్నారు. అయితే షా వ్యాఖ్యలపై పాక్ ఎలా రియాక్ట్ అవుతుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No comments:

Post a Comment