Tuesday, 6 August 2019

అసదుద్దీన్ ఒవైసీకి అమిత్ షా కౌంటర్!

అసదుద్దీన్ ఒవైసీకి అమిత్ షా కౌంటర్!
06-08-2019 20:04:02

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విభజన బిల్లు చారిత్రాత్మక తప్పిదమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. తాము చారిత్రాత్మక తప్పిదాన్ని కేవలం సరిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణపై లోక్‌సభలో ఇవాళ సభ్యులు అడిగిన ప్రశ్నలపై అమిత్ షా స్పందిస్తూ...

‘‘మేము చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నామంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కానీ వాస్తవానికి మేము చారిత్రక తప్పిదాన్ని సరిచేస్తున్నాం. ఐదేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన అభివృద్ధిని చూసి... అక్కడి ప్రజలు ఆర్టికల్ 370 వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటో అర్థం చేసుకుంటారు..’’ అని పేర్కొన్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు లోపున్న పిల్లలందరికీ విద్యా హక్కు ఉన్నప్పటికీ...  జమ్మూ కశ్మీర్‌లో ఇది అమలు కావడంలేదన్నారు. ‘‘ఆర్టికల్ 370 వల్ల ఒరిగిందేంటి? ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులన్నిటినీ తిరస్కరిస్తోంది. అక్కడ ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి...’’ అని అమిత్ షా పేర్కొన్నారు.

No comments:

Post a Comment