Thursday, 14 November 2019

కాంగ్రెస్‌ హిందూ మార్గం

కాంగ్రెస్‌ హిందూ మార్గం
10-11-2019 04:02:04

 నాడు తాళాలు తెరిపించింది మేమే.. శిలాన్యాస్‌ జరిగినదీ మా హయాంలోనే..!
 నాడు మేం చేయదలిచిందే నేడు సుప్రీం చేసింది..
 హిందువుల మనసు గెలుచుకునేందుకు యత్నం
న్యూఢిల్లీ, నవంబరు 9: అయోధ్యపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్‌ సమర్థించింది. 370 నిర్వీర్యంపై ఎంతో జాప్యం చేసి, తలోమాట మాట్లాడి అభాసుపాలైన కాంగ్రెస్‌ ఈసారి మాత్రం ఆ తప్పు జరక్కుండా చూసుకుంది. కోల్పోయిన మెజారిటీ ఓటుబ్యాంకును చేజిక్కించుకోవడానికి, మైనారిటీలను మచ్చిక చేసుకుంటున్నామన్న ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నించింది. ‘‘26 ఏళ్ల కిందట మేం పార్లమెంటలో చట్టం ద్వారా ఏం చేయాలని భావించామో సరిగ్గా దాన్నే నేడు సుప్రీంకోర్టు చేసింది. ఏకాభిప్రాయం ద్వారానో లేక కోర్టు తీర్పు ద్వారానో సమస్య పరిష్కారానికి కృషి చేశాం. మధ్యవర్తిత్వం అనేది మేం అధికారంలో ఉన్నపుడే తొలిసారిగా చోటుచేసుకుంది. ఆనాడు బీజేపీ ఎందుకు ఏకాభిప్రాయ సాధనలో దూరంగా ఉండిపోయింది? సమాజాన్ని మతపరంగా చీల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న యావతోనే బీజేపీ వ్యవహరించింది’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. ‘1986లో బాబ్రీ మసీదు తాళాలు తెరిపించినది మేమే. రాజీవ్‌ హయాంలోనే శిలాన్యా్‌సకు వీహెచ్‌పీకి అనుమతిచ్చాం. పీవీ హయాంలో మసీదు విధ్వంసం జరిగినా 1993లో ఆయన హయాంలోనే అయోధ్య చట్టం చేశాం.

No comments:

Post a Comment