Saturday, 16 November 2019

ముస్లింలలో 99 శాతం మంది ఆ మతం స్వీకరించిన వారే

శ్రీరాముడు ముస్లింలకూ ఆరాధ్యుడే
Nov 17, 2019, 04:16 IST
Yoga ramdev baba sensational comments on ayodhya issue - Sakshi
దేశంలోని 99 శాతం మంది ముస్లింలు మతం మార్చుకున్న వారే

బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ/బెంగళూరు: మన దేశంలోని ముస్లింలలో 99 శాతం మంది ఆ మతం స్వీకరించిన వారేనని, అందుకే ముస్లింలలో కూడా శ్రీరాముడిని ఆరాధించే వారు ఉన్నారని యోగా గురు రాందేవ్‌ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాందేవ్‌ మాట్లాడారు. ‘శ్రీరాముడు హిందువులకు మాత్రమే కాదు, ముస్లింలకూ ఆరాధ్యుడే. భారత్‌లోని ముస్లింలలో 99 శాతం మంది ఆ మతంలోకి మారిన వారే’అని అన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సానుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జాతి ఐక్యత కోణంలో చూడాల్సి ఉంది. శ్రీరాముని గుడి ప్రపంచంలోనే అత్యంత సుందరమైందిగా ఉండాలనేది ప్రతి హిందువు కల. కేథలిక్కులకు వాటికన్, ముస్లింలకు మక్కా, సిక్కులకు స్వర్ణ దేవాలయం మాదిరిగా హిందువులకు అయోధ్య తీర్థయాత్రాస్థలి కావాలి. అయోధ్య తీర్పు అనంతరం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతాయని కొందరు అపోహలు సృష్టించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. తీర్పు తర్వాత ఎలాంటి గొడవలు తలెత్తలేదు. భారత్‌ ఎంతో పరిణతి సాధించింది’ అని అన్నారు.

No comments:

Post a Comment