Thursday, 14 November 2019

రాముడు పుట్టింది అక్కడే

రాముడు పుట్టింది అక్కడే
10-11-2019 03:15:44

బెంచ్‌లోని ఒక జడ్జి 116పేజీల నోట్‌
న్యూఢిల్లీ, నవంబరు 9: ‘అయోధ్యలో మసీదు నిర్మాణం జరిగిన చోటే రాముడు జన్మించాడు’ అంటూ సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని ఓ జడ్జి పేర్కొన్నారు. ఈ అంశంపైఆయన ఏకంగా 116 పేజీల అనుబంధ పత్రాన్ని రాశారు. అయోధ్య వివాదాస్పద స్థలం విషయంలో విశ్వాసాలు, నమ్మకాలను ఆధారంగా తీర్పును వెలువరించలేదని ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనంలోని ఐదుగురిలో ఒక జడ్జి మాత్రం అయోధ్యలోనే రాముడు పుట్టాడని హిందువులు విశ్వసిస్తారని అభిప్రాయపడ్డారు. ఇందుకు ‘లిఖిత, మౌఖిక ఆధారాలు’ ఉన్నాయని నోట్‌లో పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం, స్కాంద పురాణం తదితర గ్రంథాల్లోని అంశాలను ఆయన తన నోట్‌లో పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలోని బాలకాండ 18వ సర్గలో 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా రాముడి జననం గురించి అప్పటి గ్రహస్థితులతో సహా ఉంది. ఆ శ్లోకాలు.. విష్ణువే కౌసల్యాసుతుడుగా అయోధ్యలో జన్మించినట్టు చెబుతున్నాయి’’ ఆ జడ్జి వివరించారు.

No comments:

Post a Comment