Thursday, 14 November 2019

1992 డిసెంబరు 6న ఏం జరిగింది?

డిసెంబరు 6న ఏం జరిగింది?
10-11-2019 03:50:36

ప్రత్యక్ష సాక్షిగా ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధి కథనం
అయోధ్యది శతాబ్దాల వివాదం! అందులో డిసెంబరు 6, 1992 ప్రత్యేక ఘట్టం! ఆ రోజు బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం సంచలనమైంది. ఇంతకీ ఆ రోజు అయోధ్యలో
ఏం జరిగింది? నాడు ప్రత్యక్షసాక్షిగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి

వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

న్యూఢిల్లీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో కరసేవ జరిపేందుకు డిసెంబరు 4న ఢిల్లీ నుంచి పెద్దఎత్తున బీజేపీ, సంఘ్‌, వీహెచ్‌పీ కార్యకర్తలు వెళుతున్నారని తెలిసి నేనూ వెళ్లాను. ఫైజాబాద్‌ ఎక్స్‌ప్రె్‌సలో ఐదో తారీఖు సాయంత్రానికి అక్కడికి చేరుకున్నాను. బాబ్రీ మసీదు చుట్టూ ఇనుప బారికేడ్లు, దాని వెనుక పోలీసులు తప్ప అంతా ప్రశాంతంగానే ఉంది. సంఘ్‌ సంచాలక్‌ సుదర్శన్‌ అక్కడే ఉన్నారు. మైదానం ఆవల లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. ఏం జరుగుతోందని నేను సుదర్శన్‌ను అడిగాను. ‘మేం కట్టబోయే మందిరానికి శిలాన్యాస్‌ (భూమి పూజ) జరుగుతోంది’ అని చెప్పారు. కొద్దిసేపటికి అశోక్‌ సింఘాల్‌, ఉమాభారతి, సాధ్వీ రితంబర, కల్‌రాజ్‌ మిశ్రా, ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, కేదార్‌నాథ్‌ సహానీ, ప్రమోద్‌ మహాజన్‌, విజయరాజే సింధియా, గిరిరాజ్‌ కిషోర్‌ వచ్చారు. వేదికపై నుంచి ఒక్కొక్కరు ప్రసంగించటం ప్రారంభించారు.

ఉన్నట్లుండి ఉదయం పదిన్నర సమయంలో కరసేవకులు బారికేడ్లను ఛేదించుకుని మసీదువైపు కరసేవకులు దూసుకెళ్లారు. వారి చేతుల్లో పలుగులు, పారలు, ఇనుప రాడ్లు కనిపించాయి. ఎక్కడ చూసినా.. ‘జై శ్రీరాం’ నినాదాల హోరే! మసీదును కాపాడడానికి సీఆర్‌పీఎఫ్‌ దగ్గరలోనే ఉన్నా ముందుకు రాలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కట్టడానికి చెందిన మూడు గుమ్మటాల్లో ఒకటి కూలిపోయింది. రెండింటికి మరోటి, సాయంత్రం 4 గంటల వరకు మూడో గుమ్మటం కూల్చివేశారు. చాలామంది ఆ శిథిలాల కింద పడి మరణించారు. సాయంత్రం అయిదు గంటల కల్లా కార్యకర్తలు తాత్కాలికంగా ఒక ఆలయాన్ని నిర్మించి అందులో రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టించారు. నేను ఫైజాబాద్‌కు తిరుగుముఖం పట్టే సమయానికే అల్లర్లు ప్రారంభమయ్యాయి.

మసీదు కూలుతున్నప్పుడు వేదిక పైనుంచి నేతల మాటలు
కూలదోసిన కట్టడానికి చెందిన ప్రతి ఇటుకా మాకు ప్రసాదం లాంటిది
ఆడ్వాణీ
కరసేవకులపై ములాయంప్రభుత్వం జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోండి..
కౌర్‌ ఏక్‌ ధక్కా ఉమాభారతి
సాధ్యమైనంత త్వరగా మసీదును కూలదోయండి
అశోక్‌ సింఘాల్‌

No comments:

Post a Comment