మరో 4 ముఖ్య కేసులు
10-11-2019 03:06:36
న్యూఢిల్లీ, నవంబరు 9: దేశమంతా ఎదురుచూసిన అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్ ఎదుట మరో నాలుగు ముఖ్య కేసులున్నాయి. వీటిలో రాజకీయంగా సున్నితమైన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసుపై రివ్యూ పిటీషన్ ఒకటి. రఫేల్ కొనుగోళ్ల అంశంపై మోదీని తాము ఆరోపిస్తున్నట్లే ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం వ్యాఖ్యానించిందంటూ తీర్పును తప్పుగా ఆపాదించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై దాఖలైన పిటిషన్ పైనాతీర్పివ్వాల్సి ఉంది. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం ఆదేశాలు అమలవడం లేదన్న పిటిషన్‌ను పరిష్కరించాల్సి ఉంది. ఇక సుప్రీం సీజే కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో వాదనలు ముగిశాయి. దానిపైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి ఉంది.

No comments:
Post a Comment