వివాదాస్పద ట్వీట్లు చేసిన 80 మంది అరెస్ట్
10-11-2019 21:02:30
లక్నో : అయోధ్య తీర్పుపై సోషల్ మీడియా ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన 80 మందిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. తీర్పు వెలువడిన రెండ్రోజుల్లో దాదాపు 80 మంది మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. తీర్పు వెలువడిన తర్వాత 34 కేసులను నమోదు చేశామని, అలాగే 77 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన 22 మందిని అరెస్టు చేశామని, మొత్తం 34 కేసులు నమోదయ్యాయని యూపీ పోలీసు అధికారులు ప్రకటించారు.

No comments:
Post a Comment