హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిములు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక హిందూ మహిళ మృతదేహానికి ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ దీనిని మత సామరస్యంనకు చిహ్నంగా అభివర్ణించారు. భోపాల్ లోని తిలా జమాల్పురాలో నివసిస్తున్న హిందూ మహిళ మరణించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న కారణంగా ఆ మహిళ బంధువులు సమయానికి భోపాల్ చేరుకోలేకపోయారు. మృతదేహాన్ని ఎక్కువసేపు ఉంచడం సాధ్యం కాకపోవడంతో ఆ ప్రాంతంలోని ముస్లిం సోదరులు ముందుకు వచ్చి, మృతురాలి భర్తతో పాటు స్మశానవాటికకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

No comments:
Post a Comment