Wednesday, 8 April 2020

కరోనా అనుమానంతో మెహబూబ్ అలీ హత్య..ముగ్గురు అరెస్ట్

కరోనా అనుమానంతో మెహబూబ్ అలీ  హత్య..ముగ్గురు అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బవానాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కుట్ర పన్నాడనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిపై దాడికి దిగి, హత్య చేసిన సంఘటన వెలుగు  చూసింది.  పోలీసులు మృతుడిని బవానాలోని హరేవాలి గ్రామానికి చెందిన మెహబూబ్ అలీగా గుర్తించారు. అలీ... తబ్లిగి జమాత్ కార్యక్రమానికి వెళ్ళాడని, తరువాత కూరగాయలతో నిండిన ట్రక్కుతో  వచ్చాడని పోలీసులు తెలిపారు. జనం అతన్ని ఆజాద్పూర్ సబ్జీ మండి దగ్గర  పట్టుకున్నారు. అయితే వైద్య పరీక్షల తరువాత అతనిని వదిలివేశారు. తరువాత అలీ  తన గ్రామానికి చేరుకున్నప్పుడు అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.




No comments:

Post a Comment