కరోనా కష్టవేళ మత విద్వేషాలా?! - రాజ్‌దీప్ సర్దేశాయి
Apr 24 2020
@ 00:24AMహోంఎడిటోరియల్ వ్యాసాలు
వైరస్ మత చిహ్నాలేమీ ధరించదు. రుగ్మతకు లోను చేసి, చావును తీసుకొచ్చే విషక్రిమి అది. మలబార్ హిల్ ధనికులనూ, ధారవి పేదలనూ; వసంత్ విహార్ కులీనులనూ, నిజాముద్దీన్ నిర్భాగ్యులనూ ఒకేలా పీడిస్తుంది. పక్షపాతం దానికి అస్వాభావికం. కరోనా వైరస్ మనకు మహా అపరిచిత (గ్రేట్ అన్‌నోన్). దాని వ్యాప్తిని అర్థం చేసుకోవాలంటే విభేదాలు, విద్వేషాలను రెచ్చగొట్టే ఎజెండాలపై కాకుండా ఖచ్చితమైన సమాచారంపై మన దృష్టిని నిరంతరం కేంద్రీకరించాలి.
కొన్నివిషయాలు హానికరమైనవి. ఈ వాస్తవాన్ని లోకానికి ఎంతగా చెప్పినప్పటికీ మీకు కంఠశోషే మిగులుతుంది. ‘న్యూస్ టెలివిజన్ ఎట్టకేలకు హిందూ -ముస్లిం దృష్టికోణం నుంచి బయటపడినట్టు అనిపిస్తుందని’ గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం ఒక పాత్రికేయ సహచరుడితో అన్నాను. నిజంగా అమితానందంతో అన్న మాటలవి. డాక్టర్లు, బయో-మెడికల్ పరిశోధకులతో మాటా మంతీ జరిపేందుకు న్యూస్‌ఛానెల్స్ పోటీ పడుతూ ఒక కొత్త (ప్రజారోగ్యం, వైరాలజీ -వైరస్‌ల అధ్యయన శాస్త్ర) ప్రపంచాన్ని కనుగొంటున్నాయి. తమ వీక్షకులను విభ్రమ పరుస్తూ అలరిస్తున్నాయి. అవి నిజంగా ప్రతి అంశాన్ని ఒక నిర్దిష్ట హిందూ-ముస్లిం భేదభావం నుంచి పరిగణించే అలవాటును విడనాడాయని సంతసించాను. అయితే ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవ లేదు. తబ్లీఘీ జమాత్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అది అలా రావడానికి, ఇలా న్యూస్ ఛానెల్స్‌లో పరిచిత ముఖాలు, సుప్రసిద్ధ కథనాలు మళ్ళీ కన్పించడానికి- విన్పించడానికి మధ్య వ్యవధి లేకుండా పోయింది. నేను ఎంతగా పొరపడ్డాను! ఒక పౌరుడుగా, ఒక పాత్రికేయుడుగా ఇంతకంటే ఎక్కువగా నేను మరే విషయంలోనూ పొరపడలేదు. కరోనా జిహాద్, తబ్లీఘిస్తాన్, తబ్లీఘ్ -పాకిస్థాన్ కుట్ర... ఇత్యాది కర్కశ, సంచలనాత్మక, ఉద్రేకపూరిత శీర్షికలు మళ్ళీ ప్రత్యక్ష మవసాగాయి. కరోనా వైరస్ కాలంలో కూడా ఇస్లామో ఫోబియా యథావిధిగా కొనసాగుతూనే వున్నది. ఎంత శోచనీయం!
గత కొద్ది సంవత్సరాలుగా ‘జాతీయవాద’ మీడియాలో ఒక ప్రబల ధోరణి స్పష్టంగా కన్పిస్తున్నది. భారతీయ ముస్లిం హింసావాది, అవిశ్వసనీయ వ్యక్తి, జాతి -వ్యతిరేకి కూడా అనేదే ఆ ప్రముఖ ధోరణి. కశ్మీర్‌లో ఉగ్రవాదం నుంచి స్వయం నియమిత మౌలానాల ఫత్వాల దాకా ప్రతి సమర్థించలేని చర్యా ఒక మత సమూహాన్ని మొత్తంగా క్షమించరాని ముద్దాయిగా నిలబెడుతున్నది. కొన్ని టీవీ ఛానెల్స్‌కు ప్రతి సాయంత్రమూ, మనో భావాలను దెబ్బతీసి, భావోద్వేగాలను రెచ్చగొట్టే మతపరమైన అంశాలకు ప్రాధాన్యమివ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది. తబ్లీఘీ కథ ఈ ఆనవాయితీకి పూర్తిగా సరిపోతుంది, బాగా ఉపయోగపడుతోంది. మసీదులో దాక్కున్న ఒక మతాచార్యుడు, కుర్తా-పైజమాలు ధరించి నిండుగడ్డాలతో వున్న యువకులు గుంపులు గుంపులుగా సంచరించడం, విదేశీ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న ఒక అఖిల భారత నెట్‌వర్క్, కరోనా పాజిటివ్ కేసులు ముస్లింలలో అత్యధికంగా వుండడం... ఇంకేం కావాలి? పౌర ధర్మాల ఆచరణలో ఒక మత బృందంవారి బాధ్యతారాహిత్యం, ఇస్లాం అనేది చట్ట విరుద్ధంగా వ్యవహరించే ఉన్మాదుల మతంగా పరిగణించేందుకు మరో ప్రాతిపదిక అయింది! అసలు తబ్లీఘీల సమావేశాన్ని నిరోధించడంలో ఢిల్లీ పోలీసులు నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని చూపారన్న వాస్తవాన్ని ఇస్లాంపై దుమ్మెత్తి పోసే వారు విస్మరిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ లాంటి ఎంపీలు నమాజ్ మొదలైన మతానుష్ఠానాలకు గుమిగూడవద్దని, లాక్‌డౌన్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాలని తమ మద్దతుదారులకు పదే పదే విజ్ఞప్తి చేశారన్న విషయాన్ని కూడా కనీస మాత్రంగానైనా పట్టించుకోనేలేదు.
ఆమాటకొస్తే మక్కా (ఇస్లాం పుణ్య స్థలి) లోని పవిత్ర కాబా పరిసర ప్రాంతంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ప్రైమ్ టైమ్ ‘శత్రువు’ను కనుగొన్నప్పుడు ఈ వాస్తవాల వి వరాలను పట్టించుకునేదెవరు? భారతీయ ముస్లిం ను ఇప్పుడు తీవ్రంగా నిందిస్తున్నారు. ‘కరోనా వాహకుడు’ అనే ముద్రను అతడిపై వేశారు. కొద్దిమంది పాల్పడిన ఒక మూర్ఖపు చర్యకు 20కోట్లమంది ముస్లింలూ మూల్యం చెల్లించాల్సిం దేనన్నట్టుగా ఇస్లాం మతవిద్వేషులు వ్యవహరిస్తున్నారు. ఇదెంతవరకు సబబు?
తబ్లిఘి జమాత్ ఉదంతం వెలుగులోకి వచ్చిన అనంతరం తప్పుడు సమాచారంతో జరుగుతున్న ప్రచారాలు ముస్లింలకు వ్యతిరేకంగా పరిణమించాయని ప్రొఫెసర్ జోయో జీత్ పాల్ (టీవీ ప్రసారాల, సామాజిక మాధ్యమాల ధోరణులపై విస్తృతస్థాయిలో పరిశోధనలు నిర్వహించిన మీడియా నిపుణుడు) నిర్ధారించారు. ఈ తప్పుడు సమాచారాన్ని తొలుత సంభావ్య చికిత్సలు, నిత్యావసర సేవల లోటుపై కలవరపాటు విషయమై ప్రచారం చేయడం జరిగింది. అయితే మార్చి నెలాఖరులో ఈ ధోరణి మారింది. ముస్లింలను నేరుగా ప్రస్తావిస్తూ భారత్‌లో కరోనా వైరస్ ప్రబలడానికి ఇస్లాం మతస్థులే బాధ్యులన్న విషపూరిత ప్రచారానికి ప్రాధాన్యం పెరిగింది. ముస్లిం జన సమూహాలు భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించడానికి సంబంధించి నకిలీ వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. వాట్సాప్ సందేశాలు కూడా ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి రాజకీయవేత్తలు ఎవరూ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మన రాజకీయ వేత్తల భావ దారిద్ర్యం, దివాలాకోరు ఆలోచనా ధోరణులను ఇదెంతైనా ప్రతిబింబిస్తున్నదని చెప్పక తప్పదు. లౌకికవాదం గురించి ఎవరు ఎంతగా మాట్లాడినప్పటికీ వారి అంతరంగం మత పరమైన దురభిప్రాయాలతో నిండిపోయి వున్నదనే సత్యాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేశాయి. పైగా తబ్లిఘీ మత సమ్మేళనంలో పాల్గొన్నవారిలో ఎంత మందికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయిందో గణాంకాలను ప్రభుత్వాధికారులు, న్యూస్ ఛానెల్స్, డిజిటల్ యోధులు ప్రతిరోజూ వెల్లడించడం పరిపాటి అయింది. మహమ్మారి పీడితులను మత పరంగా గుర్తించకూడదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాన్ని బాధ్యతాయుత వ్యక్తులు పూర్తిగా ఉపేక్షించడం ఎంతైనా గర్హనీయం.
ప్రధానమంత్రి మోదీ ఎట్టకేలకు ఏప్రిల్ మూడో వారంలో కొవిడ్ -19 కుల మతాలు, జాతి వర్గాల అంతరాలను పాటించదని వ్యాఖ్యా నించక తప్పలేదు. ‘భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లింలే బాధ్యులని అవిరామంగా జరుగుతున్న ప్రచారాన్ని’ ఇస్లామిక్ దేశాల సంస్థ (ఓఐసి) ఖండించిన మరుసటి రోజు ప్రధానమంత్రి మోదీ ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. అరబ్‌లకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపి తేజస్వి సూర్య చేసిన ఒక ట్వీట్ వైరల్ కావడంతో యుఏఇ పౌర సమాజ ప్రముఖులు పలువురు తీవ్ర నిరసన తెలిపిన అనంతరమే ప్రధాని మోదీ ఆ వ్యాఖ్య చేయడం అనివార్యమయింది. ఆ వ్యాఖ్య చేసేనాటికే మోదీ మూడు సందర్భాలలో జాతి నుద్దేశించి ప్రసంగించారు. అయితే కరోనా వ్యాప్తి విషయమై ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ట ప్రచారం గురించి ఆయన తన ప్రసంగాలలో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. రాజకీయ పలుకుబడి అపారంగా వుండడంతోపాటు అద్భుత భావప్రసార నైపుణ్యాలు గల మోదీ, కరోనా వ్యాప్తిపై మత పరమైన వివక్షతో కూడిన ప్రచారాన్ని ఖండిస్తూ మాట్లాడివుండవలసింది. కానీ మోదీ పాటించిన ఈ వైఖరి వల్ల ఎంతైనా నష్టం జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో ముస్లిం విక్రేతల నుంచి కూరగాయల కొనుగోలును బాయ్‌కాట్ చేశారు. అహ్మదాబాద్ లో మతాలవారీగా వార్డుల నేర్పాటు చేయడంపై (దరిమిలా గుజరాత్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది) వెలువడిన వార్తలు ఆందోళన కలిగించాయి. అలాగే ఇండోర్‌లో ముస్లిం మొహల్లాలలో పోలీసులు, డాక్టర్లపై మూకల దాడులకు సంబంధించిన దృశ్యాలు అమితంగా భయపెట్టాయి. పేదరికం, నిరక్షరాస్యత, మత ఛాందసవాదం అమితంగా వున్న సమాజంలో ఇటువంటి కుటిల ప్రచారాలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, పూర్తిగా విషపూరిత వాతావరణాన్ని నెలకొల్పుతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు కరోనా కల్లోలం సందర్భంలో ఇదే జరిగింది. తత్ఫలితంగా నెలకొన్న సామాజిక వైరాలు కరోనా విపత్తు సమసిపోయిన అనంతరం కూడా కొనసాగే ప్రమాదం ఎంతైనా వున్నది.
వాస్తవాలు వింతగా వుంటాయి. సత్యానంతర ప్రపంచంలో మల్టీ-మీడియా పరిశ్రమను పీడిస్తున్న నకిలీ వార్తల, తప్పుడు సమాచార వలయం నుంచి మనం బయటపడేందుకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశమే కరోనా విలయం. వైరస్ మత చిహ్నాలేమీ ధరించదు. రుగ్మతకు లోను చేసి, చావును తీసుకొచ్చే విషక్రిమి అది. మలబార్ హిల్ ధనికులనూ, ధారవి పేదలనూ, దరిద్ర దామోదరులనూ; వసంత్ విహార్ కులీనులనూ, నిజాముద్దీన్ నిర్భాగ్యులనూ ఒకేలా పీడిస్తుంది. పక్షపాతం దానికి అస్వాభావికం. కరోనా వైరస్ మనకు మహా అపరిచిత (గ్రేట్ అన్‌నోన్). దాని వ్యాప్తిని అర్థం చేసుకోవాలంటే విభేదాలు, విద్వేషాలను రెచ్చగొట్టే ఎజెండాలపై కాకుండా ఖచ్చితమైన సమాచారంపై మన దృష్టిని నిరంతరం కేంద్రీకరించాలి. డాక్టర్లు, శాస్త్రవేత్తలు మనకు అస్వస్థత నుంచి ఉపశమనం కలిగించేవారూ ఆరోగ్య సంజీవినీ పరిశోధకులే గానీ విభజించి పాలిస్తూ వర్ధిల్లే రాజకీయ వేత్తలు కానే కారు. అందుకే కరోనా కథను మతతత్వ రాజకీయాల అపస్వరాలతో కాకుండా ఒక ప్రజాసేవగా పాత్రికేయ వృత్తి స్ఫూర్తి పునరావాహనతో చెప్పి తీరాలి.
2010–-19 సంవత్సరాల మధ్య కాలాన్ని భారతీయ టీవీ మీడియా లుప్త దశాబ్దంగా చెప్పవచ్చు. ఈ కాలంలో వార్తా నివేదన తన పరమార్థాన్ని కోల్పోయింది. అర్థవంతమైన కథనాల కంటే సంచలనాత్మకతకు ప్రాధాన్యం లభించింది. ఇదే కాలంలో పలు న్యూస్‌ఛానెల్స్ అభివృద్ధిపరచుకున్న బిజినెస్ మోడల్ స్టూడియో చర్చలకు అమిత ప్రాధాన్యమిచ్చింది. ఘటనలు, పరిణామాలను నేర్పుగా నివేదించడంపై శ్రద్ధ పూర్తిగా కొరవడింది. దీనివల్ల న్యూస్ ఛానెల్స్ తమ టిఆర్‌పిలు పెంచుకున్నాయోమో గానీ క్రమంగా విశ్వసనీయతను కోల్పోయాయి. టీవీ న్యూస్ అర్థరహిత ‘ఇన్ఫోటైన్‌మెంట్’ను ప్రోత్సహిస్తున్నాయనే భావన నెలకొన్నది. ఇదే దశాబ్దంలో నవీనతరం ఆన్‌లైన్ సైట్లను వీక్షించడం ముమ్మరమయింది. టీవీలలో ప్రసారమైన అర్థరహిత చర్చల తీరుతెన్నులు పాతతరం వీక్షకులను తీవ్ర అసంతృప్తికి లోను చేశాయి. కరోనా సంక్షోభంలో అందరూ ఇంటిపట్టునే వుండిపోవలసిరావడంతో టీవీ ప్రసారాలను వీక్షించేవారి సంఖ్య పెరిగింది. లాక్‌డౌన్ మొదటివారంలో టీవీ వీక్షకుల సంఖ్య 250 శాతం మేరకు పెరిగింది. కొవిడ్ -19 పాత్రికేయులు తమ విధ్యుక్త ధర్మ నిర్వహణకు నిజాయితీగా పునరంకితమయేందుకు కొవిడ్- 19 ఒక విధంగా, బహుశా చివరి అవకాశంగా భావిం చవచ్చు, అవును, కట్టుకథలు, కల్పిత ఘర్షణలు, విభేదాలు సృష్టించే ఎజెండాలకు కాకుండా యథార్థాలు, ఆలోచనాత్మక విశ్లేషణలతో ప్రపంచ గమనాన్ని, లోకం దినచర్యను ఎప్పటికప్పుడు నివేదించేందుకు ఇదొక మహత్తర అవకాశం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మరొక అవకాశం మనకు లభించక పోవచ్చు.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ )

No comments:
Post a Comment