జమాత్ సమావేశాల్లో ఏం చేస్తారు..?
==========================
"టీం ఔటింగ్ " - గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకి. ప్రతి టీమూ కనీసం ఆర్నెళ్ళకో, నాలుగునెలలకో ఒక్కసారైనా టీం ఔటింగ్ కి తప్పనిసరిగా వెళ్ళాలనేది చాలా కంపెనీల్లో హెచ్చార్ రూల్స్ లో ఒకటి. ఇలాంటి ఔటింగ్స్ లో టీమ్ స్పిరిట్ గురించి అవగాహన కలిగేలా ఆటలాడిస్తారు. మానసికోల్లాసం కోసం డ్యాన్సులు,పాటల పోటీలు లాంటివి కండక్ట్ చేస్తారు.
ఏ.. ఆ ఆటలేవో వాల్ల ఆఫీసుల్లోనే ఆడించొచ్చు కదా, ఆ పెట్టే ఫుడ్డేదో వాల్ల క్యాంటిన్ లోకే తెప్పించి పెట్టొచ్చు కదా, ఈ మాత్రం దానికి, స్పెషల్ ట్రాన్స్ పోర్ట్ అరేంజ్ చేసి ఎక్కడో దూరంగా ఉన్న రిసార్టులకూ, బీచ్ లకూ తీసుకుపోవడం ఎందుకు?
ఎందుకంటే, రోజూ ఒకే చోట ఉంటూ, ఒకే పని చేస్తూ ఉంటే, మైండ్ కూడా ఒకే ప్యాటర్న్ కి అలవాటు పడి ఉంటుంది. అలాంటి చోట కొత్త విషయం చెప్పినా పెద్దగా తలకెక్కదు. అదే విషయం కొత్త ప్లేస్ లోకి తీసుకెల్లి, కొత్తరకంగా చెబితే, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువుంటుంది. అందుకే ఔటింగ్ లు, టీమ్ స్పిరిట్ గేమ్ లూ .
తబ్లీకే జమాత్ ది కూడా ఇదే కాన్స్పెట్.
డబ్బు సంపాదన, కుటుంబ బాధ్యత, పెళ్ళాం-పిల్లలు, సంఘంలో గౌరవం, పేరు-ప్రతిష్టలు - వీటి వెనక పరిగెడుతూ మనిషి, తనకు తెలియకుండానే, అల్లాకు దూరమవుతుంటాడు. ఈ దైనందిన జీవితం నుండీ కొద్దిగా బ్రేక్ ఇచ్చి, దాని నుండీ కొద్దిగా దూరం తీసుకెళ్ళి, అతనికి ఇస్లాం బేసిక్స్ ని మళ్ళీ బ్రష్-అప్ చేయాలి - అనేది తబ్లీకే జమాత్ సిద్ధాంతం. 10,20,30 - ఇలా ఎంతమంది ఉంటే అంత మంది ఓ జట్టుగా ఏర్పడి, తమ ఆర్థిక స్తోమతను బట్టి, పక్క ఊరుకు గానీ, పక్క జిల్లాకు గానీ, పక్క రాష్ట్రానికి గానీ,ఒక్కోసారి పక్క దేశం కానీ వెల్తుంటారు. దీనికి అయ్యే ఖర్చుని ఆ వ్యక్తులే ఎవరిది వారు పెట్టుకుంటారు. అట్లే ఎన్ని రోజులు వెల్లాలనేది కూడా, స్థోమతను,సౌకర్యాన్నీ బట్టి ఆ గ్రూప్ సభ్యులే నిర్ణయించుకుంటారు. సహజంగా , ఓ మూడు రోజులపాటు , చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాలు కవర్ అయ్యేలా ఈ ప్రోగ్రాంస్ ని డిజైన్ చేసుకుంటారు. ఏ ఊరుకెల్తే, ఆ వూరిలో ఉండే పెద్ద మసీద్ లో బస చేస్తారు. దీనిని మర్కజ్ మసీద్ అని పిలుచుకుంటారు.
వారి దినచర్య ఎలా ఉంటుంది?
-ఐదు పూటలా నమాజు-
-ఏదో ఒక నమాజు తర్వాత - ఆ మసీదుకు వచ్చిన స్థానిక ముస్లింలకు ఇస్లాం గురించి తమకు తెలిసిన విషయాలు బయాన్(స్పీచ్) ఇవ్వడం -
-ఆ మసీదు పరిసరాల్లో ఉంటూ కూడా, నమాజుకు రాని ముస్లింలెవరైనా ఉంటే, వారి ఇంటిదగ్గరికి వెళ్ళి, వారిని కలిసి, ఇస్లాం గురించి,నమాజ్ ప్రాముఖ్యం గురించీ వారికి వివరించడం. దీనికి నమాజుకు వచ్చిన స్థానిక ముస్లింల సహాయం తీసుకుంటారు.(అలా ఇతరులకు చెప్పడం వల్ల, వినే వ్యక్తిపై ప్రభావం ఉన్నా లేకున్నా, చెప్పే వ్యక్తి ఇమాన్ స్ట్రాంగ్ అవుతుంది అనేది కాన్స్పెట్)
-ఖురాన్ లో తాము అప్పటికే కంఠతా పట్టి ఉన్న భాగాలను ఇతరులకు వినిపించి, దానిలో కరెక్షన్ ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడం, కొత్త సూరాలను కంఠతా పట్టడం, దీనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, హదీసు విషయాల్ని చదివి వినిపించడం-
-ఇక మూడుపూటలా, వండుకుని తినడం. ఈ వంటపనిలో కూడా ఎవరు ఏ పని చేయాలనేది డివైడ్ చేసుకుని, టీం వర్క్ లాగా చేయడం.
ఇవీ ష్టూలంగా జమాత్ కెళ్ళే వారు చేసే పనులు. ఈ సిస్టమ్ 1927లో, ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలో మొదలైంది. అందుకే అది హెడ్ క్వార్టర్ లాగా పనిచేస్తుంది. అక్కడినుండీ బంగ్లాదేశ్,పాకిస్తాన్,ఇండోనేషియా,మలేషియా,సింగపూర్ వంటి అనేక దేశాలకు వ్యాపించింది. స్థోమత ఉన్నోల్లు కొందరు, ఒక దేశం నుండీ మరొక దేశానికి, నెల,రెండు నెలల ప్రోగ్రాం లు షేడ్యూల్ చేసుకుని వస్తూ,పోతూ ఉంటారు. ఇది ప్యూర్ గా వ్యక్తిగతంగా ఓ ముస్లిమ్ని ఇస్లాం కి మరింత దగ్గర చేయాలనే కాన్సెప్ట్ మీద ఆధారపడిన సంస్థే తప్ప, ముస్లిమేతరులకు ఇస్లాం ని బోధించి, ఇస్లాం ని వ్యాప్తి చేయాలని చూసే సంస్థ ఏమాత్రం కాదు. పైగా, వీరు పొలిటికల్ విషయాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. అందుకే పెద్దగా వారల్లోకి రారు, చాలా మంది ముస్లిమేతరులకు దీని గురించి ఏమాత్రం తెలీదు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే -
కరోనా విస్తరిస్తున్న వార్తలు జనవరినుండే వస్తున్నప్పుడు, మార్చిలో కూడా ఇండోనేషియా, మలేషియా వారిని దేశంలోనికి రానివ్వడం ప్రభుత్వం తప్పు. ఇలా ప్రభుత్వం చేసిన తప్పుల లిస్టు చాంతాడంత ఉంది. దాని గురించి రాయడం టైం వేస్టు తప్ప ఇంకోటి కాదు. దీనిని కవర్ చేసుకోవడానికి, వీసాలు లేకుండా కొన్ని వేలమంది వచ్చారని బత్తాయి గాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో తబ్లీక్ జమాత్ బిల్డింగ్ ని ఆనుకునే నిజాముద్దీన్ ఏరియా పోలీస్ స్టేషన్ ఉందనే విషయం - ఈ బత్తాయి గాల్లకు తెలీకపోవచ్చు.
కరోనా విస్తరిస్తున్న విషయం తెలియకపోవడం వల్లో, తెలిసినా - మేము అల్లా మార్గంలో వెల్తున్నాం కాబట్టి, మాకేమీ కాదనే ఓవర్ కాన్‌ఫిడెంట్ వల్లో మే 16 ఢిల్లీ ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాత కూడా వారు అక్కడే ఉండిపోయారు. కార్యక్రమాల్ని నిజంగానే అప్పటికప్పుడు రద్దు చేసినా, విదేశాల నుండీ, దూర ప్రాంతాల నుండీ వచ్చిన వారు, అప్పటికప్పుడు టికెట్ రిజర్వేషన్లను ముందుకు జరుపుకుని ప్రయాణాలు మొదలుపెట్టడం ప్రాక్టికల్ గా అయ్యేపనేనా? రిజర్వేషన్ లేకుండా బయలు దేరితే, ఏ రాత్రి, ఏ రోడ్డు మీదో, ఏ బస్టాండ్ లోనో పిచ్చి చూపులు చూస్తూ నిల్చోవాల్సి ఉంటుంది. అలాంటి ముస్లింలను మాబ్ లించింగ్ చేసి చంపినా, రైల్వేస్టేషన్ పేల్చేయడానికి అణుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు కాల్చిపడేసినా, ప్రస్తుత కాలంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు కదా. వారు ఎందుకు వెళ్ళలేదని ఇప్పుడు వాదించేవారే, వారిని చంపిపడేస్తే, ఆ టైమ్ లో అతనికి అక్కడ ఏం పని అని లాజిక్కులు తీసేవారు. ఇవన్నీ ఆలోచించి, ఇంకొన్ని రోజులు అక్కడే గడిపి బయలుదేరుదామని వారు ఆగిపోయి ఉండొచ్చు.
ఇవన్నీ పట్టించుకోకుండా, వీరు కావాలనే రోగం తెచ్చుకున్నారనీ, తమ ఇంట్లో అమ్మా,నాన్నకూ,కొడుకు,కూతుర్లకూ కావాలనే అంటగట్టారనీ కనీస బుద్ధీ, ఙానం ఉన్నోల్లెవరూ అనరు. బత్తాయిగాల్లకూ, దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడీయాకూ ఈ రెండూ లేవనే విషయం తెలిసిందే కాబట్టి, దీనిలో కూడా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.
నిండా మునిగినోడికి చలివేయదన్నట్లు, ఇస్లాం/ముస్లిం లపై నిత్యం వచ్చే ఇస్లామోఫోబిక్ డైలీ సీరియల్లో ఇదో కొత్త ఎపిసోడ్. దీనితో కొత్తగా జరిగే డ్యామేజీ ఏమీ లేదు. This Too Shall Pass. Haneef Mahammad Shaik

No comments:
Post a Comment