Saturday, 25 April 2020

60శాతం కేసులు మర్కజ్‌వే- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

60శాతం కేసులు మర్కజ్‌వే- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌లో టెలీ మెడిసిన్‌ సేవలు ప్రారంభం
బర్కత్‌పుర, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులలో 60 శాతం ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారివేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌-19ను పూర్తిగా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి తగినసహకారం అందడం లేదని, దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తేనే వైర్‌సను పూర్తిగా నాశనం చేయవచ్చునని తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు టెలీ మెడిసిన్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. శనివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో బీజేపీ అనుబంధ డాక్టర్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టెలీ మెడిసిన్‌ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంతోపాటు సూర్యాపేట, నిజామాబాద్‌, గద్వాలలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో కేంద్ర బృందం కూడా పర్యటిస్తోందని, కరోనాను నివారించడానికి కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.


నిరంతరాయంగా టెలీ మెడిసిన్‌ సేవలు

లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం అందించడానికి టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చామని బీజేపీ అనుబంధ డాక్టర్స్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సురే్‌షగౌడ్‌ వెల్లడించారు. ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి ఉచితంగా వైద్యుల సలహాలు పొందవచ్చునని తెలిపారు. బయటకు వెళ్లలేని దివ్యాంగులు, వృద్ధులకు మందులను ఇంటి వద్దకే అందజేస్తామని ఆయన తెలిపారు. ఆపదలో ఉన్నవారికి ఏ సమయంలోనైనా అంబులెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 9959261273 నెంబర్‌లో గానీ, జి.కిషన్‌రెడ్డి డాట్‌ కామ్‌ ద్వారా ఈ ఉచిత సేవలు పొందవచ్చునని చెప్పారు.

No comments:

Post a Comment