Friday, 24 April 2020

పాల్ఘర్‌లో సాధువులను కొట్టిచంపిన మూక... 110 మంది అరెస్ట్

పాల్ఘర్‌లో సాధువులను కొట్టిచంపిన మూక... 110 మంది అరెస్ట్
20 ఏప్రిల్ 2020
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ షేర్ చేయండి
Image copyrightGETTY IMAGES
చిత్రం శీర్షిక
ప్రతీకాత్మక చిత్రం
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో గురువారం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న మూకదాడికి సంబంధించి నిందితులను అరెస్టు చేశామని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు.

‘‘పాల్ఘర్ ఘటనపై చర్యలు తీసుకున్నాం. నిందితులందరినీ అరెస్టు చేశాం. హేయమైన ఈ నేరానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తాం’’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

Image Copyright @CMOMaharashtra@CMOMAHARASHTRA
పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం సూరత్‌కు కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పాల్ఘర్‌లో కొందరు అడ్డుకున్నారు. వాళ్లను కారు నుంచి బయటకు లాగి కొట్టి చంపారు.

కారులో ప్రయాణిస్తున్నది దొంగలనే అనుమానంతో ఆ మూక వారిపై దాడి చేసింది.

కానీ, వాళ్లు సూరత్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు.

ఇండియా లాక్‌డౌన్: రేషన్ కోసం లైన్‌లో నిల్చున్న మహిళ మృతి
గ్రాహం స్టెయిన్స్: భారత్‌లో ఫేక్ న్యూస్, వదంతుల కారణంగా జరిగిన మొదటి మూకదాడి, హత్య ఇదేనేమో - Ground Report
Image copyrightOFFICEOFUT /TWITTER
చిత్రం శీర్షిక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధవ్ ఠాక్రే
దాడిలో మరణించిన ఈ ముగ్గురిలో ఇద్దరు సాధువులు, మరొకరు వాళ్ల కారు డ్రైవర్.

సాధువుల్లో ఒకరి వయసు 70 ఏళ్లు, మరొకరి వయసు 35 ఏళ్లు ఉంటుంది. వీరితోపాటు ఉన్న కారు డ్రైవర్ వయసు 30 ఏళ్లు.

ఘటనకు సంబంధించి మొత్తం 110 మంది నిందితులను అరెస్టు చేశామని, వారిలో 9 మంది మైనర్లు ఉన్నారని పాల్ఘర్ పోలీసులు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.

నిందితుల్లో 101 మంది ఈ నెల 30 వరకూ పోలీసు కస్టడీలో ఉంటారని, ఘటనపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Image Copyright @Palghar_Police@PALGHAR_POLICE
ఉన్నత స్థాయి విచారణ జరపాలి: బీజేపీ

గురువారం రాత్రి ఈ మూక దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దాడి జరుగుతున్న సమయంలో పోలీసు అధికారి అక్కడే ఉండటం ఆ వీడియోలో కనిపించింది.

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు.

‘‘పోలీసుల ముందే ఓ గుంపు మనుషుల్ని కొడుతుండటం సిగ్గుపడాల్సిన విషయం. పోలీసుల దగ్గరి నుంచి లాక్కెళ్లి మరీ కొడుతున్నారు. మహారాష్ట్రలో చట్టవ్యవస్థ బలహీనపడిపోయిందా?’’ అని ఆయన ప్రశ్నించారు.

Image Copyright @Dev_Fadnavis@DEV_FADNAVIS
అఖిల భారతీయ అఖాడా పరిషత్ సంస్థ కూడా ఈ దాడిని ఖండించింది. బాధిత సాధువులు జూనా అఖాడేకు సంబంధించినవారుగా పేర్కొంది.

మరోవైపు దేశంలో 144 సెక్షన్ అమల్లో ఉంటే ఇంత మంది జనం ఎలా పోగయ్యారని జూనా అఖాడే అధికార ప్రతినిధి మహంత్ నారారణ్ గిరి సందేహం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా పాల్ఘర్ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్‌ను విచక్షణరహితంగా కొందరు కొట్టిచంపారు. ఇప్పటివరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాయంటూ ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’ అని ఆయన అన్నారు.

No comments:

Post a Comment