తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ బంధువులిద్దరికి కరోనా వైరస్
సహరాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ బంధువులిద్దరికి కరోనా వైరస్ సోకింది. సహరాన్‌పూర్ పట్టణానికి చెందిన మౌలానా సాద్ ఖాంధాల్వీ సమీప బంధువులైన ఇద్దరు మొహల్లా ముఫ్తీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చారు. మౌలానా సాద్ బంధువులిద్దరూ ఆయనతో సన్నిహితంగా తిరిగారని, దీంతో వారిద్దరినీ పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని సహరాన్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ చెప్పారు. కరోనా వచ్చిన వారిద్దరినీ ఫతేపూర్ లోని లెవెల్ 1 ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కరోనా రోగులున్న నివాసప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ హాట్ స్పాట్ గా గుర్తించి శానిటైజ్ చేశారు. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టరు కోరారు. కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖాంధాల్వీపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారి కోసం పోలీసు బృందం గాలిస్తుందని కలెక్టరు చెప్పారు. ఒక్క సహరాన్‌పూర్ జిల్లాలోనే మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చిన 44 మందికి కరోనా పాజిటివ్ అని రావడంతో 19 కరోనా హాట్ స్పాట్ లుగా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 735 మందికి కరోనా పాజిటివ్ అని రాగా 11 మంది మరణించారు.
వీసా నిబంధనలను ఉల్లంఘించిన 11 మంది జమాత్ విదేశీయులకు జైలు
బక్సర్ (బీహార్): కరోనా లాక్‌డౌన్ అమలు అవుతున్న సమయంలో 11 మంది విదేశాలకు చెందిన తబ్లీగ్ జమాత్ సభ్యులు వీసా నిబంధనలను ఉల్లంఘించడంతో వారిని జైలుకు పంపించామని బక్సర్ జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ చెప్పారు. ఇండోనేషియా, మలేషియా దేశాలకు చెందిన 11 మందికి కరోనా అనుమానంతో 14 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. వారికి కరోనా సోకలేదని తేలింది. వీసా నిబంధనలను ఉల్లంఘించి 11మంది విదేశీయులు బక్సర్ జిల్లాలో సంచరిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిని అరెస్టు చేసి జైలుకు తరలించామని ఎస్పీ పేర్కొన్నారు. బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలోనూ 9 మంది బంగ్లాదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించి లాక్ డౌన్ సమయంలో తబ్లీగ్ జమాత్ మతప్రచారం సాగిస్తుండటంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు.నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలకు నీళ్లు వదిలి దేశంలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు.

No comments:
Post a Comment