రిజర్వేషన్ బిల్లులో ఏముంది?
దిల్లీ: అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇంతవరకు రిజర్వేషన్లు వర్తించనివారిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం కల్పించడమే తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల నిరసనల నడుమ ఆయన బిల్లును ప్రవేశపెడుతూ ముఖ్యాంశాలను వివరించారు.
‘ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాలు పొందడంలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారితో పోటీ పడలేకపోతున్నారు. వాటికి వారు దూరమవుతున్నారు. దీని దృష్ట్యా రాజ్యాంగంలోని 15వ అధికరణను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రజల్లో ఆర్థికంగా వెనుకబడిన ఏ వర్గానికైనా ప్రయోజనాలు కల్పించడానికి రాష్ట్రాలకు ప్రత్యేక అనుమతి లభించేందుకు వీలుగా ఒక నిబంధనను చేర్చాలనేది ప్రతిపాదన. ప్రభుత్వ సాయంతో నడిచే విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు సహా అన్నింటిలో (మైనారిటీ విద్యాసంస్థలు మినహా) ప్రవేశాలకు ఈ నిబంధనలు వీలు కల్పిస్తాయి. ప్రస్తుత రిజర్వేషన్లకు ఇవి అదనం. ప్రతీ విభాగంలో ఉన్న మొత్తం సీట్లలో గరిష్ఠంగా 10 శాతానికి మించకుండా ఈ రిజర్వేషన్‌ను వర్తింపజేస్తాం’ అని బిల్లులో పేర్కొన్నారు.
సముచిత అవకాశాల కోసం ఈ సవరణ
‘రాజ్యాంగంలోని 46వ అధికరణలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల ప్రకారం బలహీన వర్గాల ప్రజల, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సి ఉంది. సామాజిక అన్యాయాలు, అన్ని రూపాల్లోని దోపిడీ నుంచి వారిని పరిరక్షించాలి. (అగ్రవర్ణాల్లో) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు ప్రస్తుత రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి అర్హులు కాదు. 46వ అధికరణను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న పౌరులు విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు పొందడానికి భారత రాజ్యాంగాన్ని సవరించాలని నిర్ణయించాం.’ అని బిల్లు లక్ష్యాల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఉన్నత విద్యా సంస్థల్లో కోటా అమలుకు కసరత్తు
దిల్లీ: అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనకు చర్యలు ఆరంభించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో అగ్రవర్ణ పేదలకు పదో వంతు కోటా కల్పించేందుకు సోమవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన క్రమంలో ఈ క్రతువు చేపట్టినట్టు మంగళవారం హెచ్‌ఆర్‌డీ వర్గాలు తెలిపాయి. ‘‘పది శాతం కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు ఈ కోటాను కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు సీట్ల పెంపు విషయమై ఆలోచిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, విశ్వవిద్యాలయాలన్నింటిలో కలిపి మొత్తం పది లక్షల మేర సీట్ల సంఖ్యను పెంచాల్సి వస్తుందని ప్రాథమిక అంచనాకు వచ్చాం’’ అని పేర్కొన్నాయి. అఖిలభారత ఉన్నత విద్యా సర్వే (2017-18) ప్రకారం... దేశవ్యాప్తంగా 903 విశ్వవిద్యాలయాలు, 39 వేల కళాశాలలు, 10 వేల స్వతంత్ర విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిలో ఇప్పుడు కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను పెంచుతారని తెలుస్తోంది.
రాజ్యాంగ విరుద్ధం... కోటా బిల్లుపై న్యాయ నిపుణుల వ్యాఖ్య
దిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ‘రాజ్యాంగ విరుద్ధం’, ‘రాజకీయ ఆయుధం’ అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. బిల్లును న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలున్నాయని సీనియర్ న్యాయవాదులు రాకేష్ ద్వివేది, రాజీవ్ ధావన్, అజిత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఇందిరా సాహ్నీ కేసులో వెలువడిన తీర్పు... ప్రభుత్వ నిర్ణయానికి అడ్డంకిగా మారుతుందని చెప్పారు. ఇది ఎన్నికల ఎత్తుగడ అని ద్వివేది చెప్పారు. రిజర్వేషన్లకు గరిష్ఠ పరిమితిని 50 శాతంగా గతంలో సుప్రీంకోర్టు చెప్పినా దానిని ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేనిదిగా’’ పరిగణించకూడదని చెప్పారు. ప్రత్యేక కారణాలుంటే దీనిని అధిగమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని, అవి సహేతుకమా కాదా అనేదే కోర్టు చూస్తుందని అన్నారు. బిల్లు మాత్రం రాజ్యాంగ విరుద్ధమని ధావన్ చెప్పారు. అదనపు రిజర్వేషన్ల అంశం న్యాయసమీక్షలో నెగ్గాల్సిందేనని సిన్హా చెప్పారు.

No comments:
Post a Comment