Tuesday, 8 January 2019

భారత వృద్ధిరేటు 7.3శాతం

భారత వృద్ధిరేటు 7.3శాతం
ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు



దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో భారత వృద్ధి రేటు 7.3శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ వృద్ధి 7.5శాతంగా ఉండొచ్చని పేర్కొంది. పెట్టుబడులు, వినియోగంలో పెరుగుదలే దీనికి కారణమని తెలిపింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ముందుందని ప్రపంచబ్యాంక్‌ వెల్లడించింది.

జీఎస్‌టీ, నోట్ల రద్దు కారణంగా 2017 భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు గురై వృద్ధిరేటు 6.7శాతానికి పరిమితమైనట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశీయ వృద్ధిలో గతేడాది భారత్‌ కంటే చైనా ముందుందని, అయితే ఈ ఏడాది మాత్రం ఆ దేశ వృద్ధిరేటు మందగిస్తుందని అంచనా వేసింది. 2018లో చైనా వృద్దిరేటు 6.5శాతానికే పరిమితమవుతుందని, 2021 నాటికి అది 6శాతానికి పడిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంక్‌ తమ అంచనాల్లో పేర్కొంది.

‘వినియోగంలో పెరుగుదల, పెట్టుబడులతో భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. 2018-19 ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ వృద్ధిరేటు 7.3శాతంగా ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. ఇక 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్దిరేటు 7.5శాతంగా ఉండొచ్చు’ అని ప్రపంచ బ్యాంక్‌ ప్రాస్పెక్ట్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అయాన్‌ ఖోస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు గతేడాది 3శాతంగా ఉంటే..  ఈ ఏడాది 2.9శాతానికి పరిమితమయ్యేలా ఉందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయం వ్యక్తం తెలిపింది. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒడుదొడుకులు తప్పేలా లేవని పేర్కొంది

No comments:

Post a Comment