అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్
10% విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం
మంత్రివర్గం ఆమోద ముద్ర
నేడు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు
జనరల్ 40.5 %
ఓబిసి 27 %
ఎస్ సి 15 %
ఎస్ టి 7.5 %
ఇబిసి 10 %
మొత్తం 100 %
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన కేంద్ర ప్రభుత్వం కీలకమైన అస్త్రాన్ని బయటకు తీసింది. భాజపాకు బలమైన మద్దతుదారులుగా ఉన్న అగ్రవర్ణ మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు పావులు కదిపింది. ఆర్థికస్థోమత ప్రాతిపదికగా వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రతిపాదించింది. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది.
అర్హులు ఎవరు?
ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇవ్వనుంది. ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే..
* వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు...
* అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు...
* నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..
* నాన్-నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..
అగ్రవర్ణ పేదలకు 10% కోటా
దిల్లీ: అగ్రవర్ణ పేదలకు ఆర్థికస్థోమత ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విధించిన 50% గరిష్ఠ పరిమితికి అదనంగా ఈ కోటా ప్రతిపాదిస్తున్నందువల్ల దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును.. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు చివరిరోజైన మంగళవారమే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు పలకాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లుకు రాజ్యసభలో విపక్షాలు ఆమోదించకపోతే సమాజంలో ప్రభావవంతమైన వర్గం మద్దతును అవి కోల్పోవాల్సి వస్తుందనేది భాజపా విశ్వాసం. మొదటి నుంచి భాజపాకి అండగా ఉంటున్న అగ్రవర్ణాలవారు ఇటీవలి కాలంలో పార్టీకి కాస్త దూరమవుతున్నట్లు కనిపిస్తుండడంతో భారీ అస్త్రాన్ని ప్రభుత్వం సంధించినట్లు భావిస్తున్నారు. ఈ బిల్లు కోసం అవసరమైతే శీతాకాల సమావేశాలను మరో రెండ్రోజులు పొడిగించే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా రాజకీయ ఎత్తుగడ అని విపక్షాలు విమర్శించాయి. దీనిని ఎలా అమలు చేస్తారో చెప్పాలంటూ పట్టుపట్టాయి.
బిల్లుకు మద్దతు ఇస్తాం గానీ ఇది ఎన్నికల ఎత్తుగడ
‘కేంద్ర నిర్ణయం ఎన్నికల ఎత్తుగడ. ప్రజల్ని మోసగించే చర్య. కోటాపై 50% పరిమితి ఉన్నప్పుడు దీనిని ఎలా అమలు చేస్తారు? లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం భాజపాని ఆవరించిందనడానికి ఇదే నిదర్శనం. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన సంఖ్యాబలం భాజపాకి లేదు. బిల్లుకు మేం మాత్రం మద్దతు ఇస్తాం.’ - అభిషేక్ మను సింఘ్వి, సూర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు.
‘ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. అలా చేయని పక్షంలో ఇదొక రాజకీయ స్టంటుగా మిగిలిపోతుంది. బిల్లు పెడితే మేం మద్దతు ఇస్తాం.’ - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.
‘బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు వస్తాయంటే సంతోషమే. కానీ రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఈ కోటా ఎంత వరకు చెల్లుబాటవుతుంది?’ - మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.
ప్రధాని నిర్ణయం విప్లవాత్మకమైనది
‘ప్రధాని మోదీ నిర్ణయం విప్లవాత్మకమైనది. కాపు, బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ తదితర అగ్రకులాల్లో పేదవారికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తాయి. 70 ఏళ్లపాటు వీరిపై కాంగ్రెస్ చూపిన వివక్ష వైఖరిని మోదీ అంతమొందించారు.’ - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు
అగ్రవర్ణ పేదలపై అకస్మాత్తుగా ప్రేమ ఎందుకో..?
‘అగ్రవర్ణ పేదలపై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అకస్మాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? ఏ ప్రతిపాదికన 10% రిజర్వేషన్లు అంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. రిజర్వేషన్లకు సంబంధించి చాలా రాష్ట్రాలు తీర్మానాలు పంపాయి. వాటి మీద ఏ నిర్ణయం తీసుకున్నారో తెలపాలి.’ - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

No comments:
Post a Comment