Thursday, 31 January 2019

సంతోషంగా మరణిస్తున్నా.. ఆనందంగా ఉండండి!

సంతోషంగా మరణిస్తున్నా.. ఆనందంగా ఉండండి!
Jan 31, 2019, 17:05 IST
 Young Girl Suicide In Nalgonda - Sakshi
సాక్షి, నల్గొండ: ‘అమ్మా! నాన్న! నేను సంతోషంగా చనిపోతున్నాను.. నా గురించి బాధ పడకుండా ఆనందంగా ఉండాలి’. తల్లిదండ్రులకు భారం కాలేక.. రోజూ చస్తూ బ్రతకలేక ఓ యువతి ఆత్మహత్యకు సిద్దమై చివరిగా తల్లిదండ్రులకు రాసిన మాటలివి. తలలో అయిన గాయానికి చికిత్స చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని, తల్లిదండ్రులను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టి రోగిలా బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంది నల్గొండ జిల్లాకు చెందిన అబీబు ఉనిస అనే యువతి. వివరాల మేరకు.. కొలపూర్ అమనుగలుకు చెందిన అబీబు ఉనిస వెంకటేశ్వరా కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతోంది. కొన్ని నెలల క్రితం ప్రమాదంలో గాయాలపాలైనప్పటికి ఈ విషయం చెబితే తల్లిదండ్రులకు బాధపడతారని వారికి చెప్పలేదు.

కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో రక్తపు వాంతులు అవ్వటం ప్రారంభమయ్యాయి. దీంతో ఉనిస డాక్టర్ని సంప్రదించింది. వైద్యపరీక్షల అనంతరం గాయం కారణంగా తలలో రక్తం గడ్డకట్టిందని తేలింది. ఇందుకు చికిత్స చేయాలంటే దాదాపు 20లక్షల రూపాయలు ఖర్చుచేయాలని డాక్టర్లు చెప్పారు. అంత పెద్దమొత్తం డబ్బులు ఖర్చు చేసే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని, ఖర్చు చేసినా రోగిలాగా చస్తూ బ్రతకలేనంటూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సూసైడ్‌ నోట్‌ రాసి  ఆత్మహత్యకు పాల్పడింది.

No comments:

Post a Comment