Thursday, 17 January 2019

కథువా ఘటన జరిగి ఏడాది...మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు...

కథువా ఘటన జరిగి ఏడాది...మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు...
18-01-2019 07:47:03

శ్రీనగర్: కథువా ఘటన జరిగి ఏడాది అయిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు చేశారు. కథువా సమీపంలోని రసానా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి పలుసార్లు సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన గత ఏడాది జనవరిలో సంచలనం రేపింది. బాలికపై అత్యాచారం చేసిన నిందితులకు బీజేపీ నేతలు బాసటగా నిలిచారని మెహబూబా ముఫ్తీ విమర్శల వర్షం కురిపించారు. కథువా ఘటనను ఖండించాల్సిన బీజేపీ ప్రజాప్రతినిధులు అత్యాచార బాధిత నిందితులకు మద్ధతుగా ర్యాలీలు జరపడం దురదృష్టకరమని మెహబూబా వ్యాఖ్యానించారు. హిందూ ఏక్తామంచ్ తో బీజేపీ అత్యాచార బాధితులకు వంత పాడటం ఏమిటని ముఫ్తీ ప్రశ్నించారు. దీనిపై జమ్మూకశ్మీర్ బీజేపీ నాయకుడు అల్తాఫ్ ఠాకూర్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల సానుభూతి పొందేందుకే పీడీపీ నాయకురాలు మెహబూబా విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ విమర్శించారు.

No comments:

Post a Comment