ముస్లిం కోటా కోసం ఇక కేంద్రం మీద పోరు : గవర్నర్ నరసింహన్
20-01-2019 03:19:38
రిజర్వేషన్ల సాధనకు కేంద్రంతో పోరాటమే..
ఎస్టీలకు 10%, మైనారిటీలకు 12% ఇవ్వాల్సిందే
ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాల్లో ఎస్టీలకు 10 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాం. వాటి అమలు కోసం కేంద్రంతో రాజీ లేని పోరాటం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది’’ అని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి శనివారం ఆయన ప్రసంగించారు. రైతులకు లక్షదాకా ఉన్న పంట రుణాలు మాఫీ చేసి, రైతుబంధు సాయాన్ని పది వేలకు పెంచుతామని తెలిపారు. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి అందిస్తామన్నారు. ఆసరా పెన్షన్లను రూ.2,016కు, దివ్యాంగుల పెన్షన్ రూ.3,016కు పెంచుతామని చెప్పారు.
వృద్ధాప్య పెన్షన్ పొందే వయో పరిమితిని సడలించి, 57 ఏళ్లు నిండిన వారందరికీ పెంచిన పెన్షన్లను అందించబోతున్నామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున భృతి అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు. ఐదేళ్లలోపు నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, కోటి ఎకరాలకు నీళ్లిస్తామని తెలిపారు. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని పునరుద్ఘాటించారు. ప్రజలు అందించిన అపూర్వ విజయం పునాదిగా.. బంగారు తెలంగాణ నిర్మాణానికి తన ప్రభుత్వం పునరంకితమవుతుందని ప్రకటించారు. కేసీఆర్ పాలనతో దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా పురోగమిస్తోందని, అందుకే, గత ఎన్నికల్లో ప్రజలు మూడింట రెండు వంతుల మెజారిటీతో పట్టం కట్టారని, ఈ విజయాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ హామీల అమలుకు చర్యలు చేపట్టామని వివరించారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఖాయిలా పడిన ఇతర పరిశ్రమలను తెరిపిస్తామన్నారు.

No comments:
Post a Comment