/9/2019 8:03:53 AM
గుంటూరు నుంచి పోటీ చేయాలనుంది!: అలీ
విశాఖపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు అలీ మంగళవారం విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. గతంలో గంటా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అలీ ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అలీ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో గంటాతో భేటీ అయ్యారు. గత ఇరవయ్యేళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని ఈ సందర్భంగా గంటాకు వివరించారు. పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టినా తనను ఆహ్వానించలేదని, వైసీపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మంత్రికి చెప్పారు. తనకు గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని, అదేవిధంగా మైనారిటీ కోటాలో మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నట్లు మనసులో మాట వెల్లడించారు. ఇటీవల సీఎం చంద్రబాబును కూడా కలిసి మాట్లాడగా భరోసా ఇచ్చారని, మీ తరఫున కూడా తగిన సహకారం అందించాలని మంత్రిని అలీ కోరారు.

No comments:
Post a Comment