Friday, 31 August 2018

‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’

‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’
Aug 31, 2018, 12:42 IST
 Muslim Minorities Protest Against TDP In Guntur - Sakshi
సభలో హామీల అమలు కోరిన ముస్లిం యువకుడిని లాక్కెళ్తున్న పోలీసులు(ఫైల్‌)

గుంటూరు :నాలుగేళ్లుగా తిరగని కార్యాలయం లేదు.. పెట్టని అర్జీ లేదు.. ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. అందుకే సీఎం వద్దే తమ గోడు వెళ్లబోసుకుంటే కాస్తయినా దయ చూపుతారని ఆశించారు. ఎంతో శ్రమకోర్చి కర్నూలు జిల్లా నుంచి గుంటూరులోని ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభ వద్దకు వచ్చారు. పాలకులను కలిసే అవకాశం లేక ప్లకార్డుల రూపంలో వారి ఆవేదనను వెలిబుచ్చారు. ముస్లిం సంక్షేమమే టీడీపీ ధ్యేయమంటూ సీఎం మాటలు మైకుల్లో దద్దరిల్లుతుండగా.. ప్లకార్డులు చూపిన ముస్లిం యువకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. 24 గంటల తర్వాత టీడీపీ నేత మీరావలి ఫిర్యాదుతో కేసు కట్టారు. న్యాయం చేయండయ్యా అని వేడుకుంటే.. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఘొల్లుమంటున్నారు.. ఫిర్యాదు చేసిన మీరావలి సైతం.. కావాలనే తనతో టీడీపీ నేతలు కేసు పెట్టించి.. వారంతా తప్పుకున్నారని, తోటి ముస్లిం యువకులకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నానని వాపోతున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై రాష్ట్రంలోని ముస్లింలంతా టీడీపీ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఎక్కడికక్కడ నిరసన గళం వినిపిస్తున్నారు. 

ఎన్నికలు రానున్న తరుణంలో ముస్లిం మైనార్టీలను మరోసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం మైనార్టీలు మండిపడుతున్నారు. ‘నారా హమారా..టీడీపీ హమారా’ పేరిట నిర్వహించిన సభలో వందల కోట్ల రూపాయల విలువైన అనేక  హామీలు గుప్పించిన చంద్రబాబు, వాటిని ఎలా అమలు చేయగలరో చెప్పాలని నిలదీస్తున్నారు. 2019లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేదని, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎక్కడి నుంచి నిధులు తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరిన ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’  నినాదంతో ముందుకు వెళ్తామని పేర్కొంటున్నారు.  చంద్రబాబు ముస్లింలను మోసం చేస్తున్న తీరు వివరిస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

నిరసన తెలిపితే నాన్‌ బెయిలబుల్‌ కేసులా?
మైనార్టీ సదస్సులో సీఎం చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలపై మౌనంగా ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువతను అరెస్టు చేయడం,  మాట్లాడేందుకు వెళ్లిన సంచార్‌ కమిటీ మెంబర్‌ హబిబుల్లాను కూడా అరెస్టు చేసి నాన్‌బెయిలబుల్‌ కేసులు బనాయించారు. చంద్రబాబు వైఖరి చూస్తే ముస్లిం మైనార్టీ పట్ల టీడీపీ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది.
  – సయ్యద్‌ మహబూబ్, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగంనరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడుప్రజాస్వామ్యం అపహాస్యం
Aug 31, 2018, 13:01 IST
 Nellore Muslim Leaders Protest Against TDP And Chandrababu naidu - Sakshi
గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్‌

నెల్లూరు, కోట: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ ఆరోపించారు. గుంటూరు సభలో ఎనిమిది మంది ముస్లిం యువకుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కోటలో ముస్లింలు గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మురళీధర్‌ మాట్లాడుతూ ఈ నెల 28న గుంటూరులో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా సభ ఒక నాటకమన్నారు. ముస్లింలంతా మా వైపే ఉన్నారని చెప్పుకునేందుకు చంద్రబాబు ఆడించిన నాటకమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంటే సహించలేక పోలీసుల చేత అరెస్ట్‌ చేయించడం ఎంతవరకు సబబన్నారు. చంద్రబాబు చేష్టలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే స్వేచ్ఛ ఎవరికైనా ఉందన్నారు. దాన్ని పెద్ద నేరంగా చూపించడం తగదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు సరిదిద్దుకుని అరెస్ట్‌ చేసిన యువకులను విడుదల చేయాలన్నారు.

చంద్రబాబుకు జగన్‌ భయం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు యువత పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మొబీన్‌బాషా ఆరోపించారు. రాష్ట్రంలో యువత అంతా జగన్‌ వెంటనే నడుస్తుందన్నారు. గుంటూరులో ముస్లిం యువకులను అరెస్ట్‌ చేయడం ద్వారా చంద్రబాబునాయుడు పెద్ద తప్పిదమే చేశారన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని తెలిపారు. కోటలో ముస్లిం యువకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిఒక్కరూ మద్దతు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి, ముస్లిం హక్కుల పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు అన్వర్, ముస్లిం మైనార్టీ నాయకులు మొబీన్‌బాషా, మాజీ ఉపసర్పంచ్‌ ఇంతి యాజ్, ఇస్మాయిల్, కరీముల్లా, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, వజ్జా చంద్రారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి, పల్లెమల్లు శ్రీనివాసులురెడ్డి, గాది భాస్కర్‌ పాల్గొన్నారు.

ముస్లింలపై బాబుకు సవతి ప్రేమ
Aug 31, 2018, 12:51 IST
 YSRCP Leaders Slams Chandrababu Naidu In Nandikotkuru - Sakshi
నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య(పాత చిత్రం)

నందికొట్కూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముస్లింలపై సవతి ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఐజయ్య విలేకరులతో మాట్లాడారు. ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిని భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలలో మసీదులలో ఉన్న ఇమామ్‌లకు జీతాలు ఇస్తాను అని హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు.

సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ముస్లింలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వారు భయపడరని, వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన ముస్లిం సోదరులను విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. గుంటూరులో నారా హమారా-టీడీపీ హమారా అనే కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని స్థానిక సీఐకి వినతిపత్రం సమర్పించారు.

చంద్రబాబూ.. ఖబడ్దార్‌!
Aug 31, 2018, 12:56 IST
 Muslim Minorities Leaders Protest Against TDP In Prakasam - Sakshi
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే అరెస్ట్‌ చేస్తారా?

ముస్లిం యువకులను చిత్ర హింసలు పెట్టడం అన్యాయం

నంద్యాల ముస్లిం యువకులపై కేసులు ఎత్తేయాలి

ముస్లింలు ఏకమైతే ప్రభుత్వాలు కూలిపోతాయ్‌

నారా నహీ హమారా.. టీడీపీ నహీ హమారా..

ఒంగోలులో ముస్లిం మైనారిటీ నాయకుల ర్యాలీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి

ఒంగోలు సబర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డౌన్‌..డౌన్‌.. ముస్లింలపై సర్కారు దౌర్జన్యకాండ నశించాలి.. చంద్రబాబు నియతృత్వ పోకడలు మానుకోవాలి.. టీడీపీ సర్కార్‌ ముస్లింల అణచివేత ధోరణిని విడనాడాలి.. అంటూ ఒంగోలు నగరంలో ముస్లింలు నినదించారు. ముస్లింలపై చంద్రబాబు సర్కార్‌ దౌర్జన్యకాండను నిరశిస్తూ వైఎస్సార్‌ సీపీ ముస్లిం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నుంచి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం జనరల్‌ సెక్రటరీ షేక్‌ సుభానీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి పోస్టాఫీస్‌ మీదుగా ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో చంద్రబాబు వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని, పోలీసులే అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉంటూ రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులు అడిగినందుకు ముస్లింలను అక్రమంగా గుంటూరులో అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

ముస్లింలను అప్రజాస్వామ్యంగా, అక్రమంగా అరెస్టు చేయవద్దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ముస్లిం నేతలు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఎనిమిది మంది ముస్లిం యువకులను నిర్బంధించడం దారుణమన్నారు. చంద్రబాబు సభను భగ్నం చేయాలని చూశారని నంద్యాలకు చెందిన ముస్లిం యువకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. నారా హమారా– టీడీపీ హమారా అనేది అబద్ధమని, నారా నహీ హమారా.. టీడీపీ నహీ హమారా అనేది వాస్తవమన్నారు. నిజాన్ని ముస్లిం సమాజం గమనించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు బూటకపు హామీలపై జాగ్రత్తగా ఉండాలని ముస్లింలకు సూచించారు. ముస్లింలకు రక్షణ కల్పిస్తామని గుంటూరు సభలో చెప్పిన చంద్రబాబు అక్కడే ఎనిమిది మంది ముస్లిం యువకులను ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. ఇలాంటి కర్కశ నియంతృత్వ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని, ఖబడ్దార్‌.. అంటూ హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌ కళా పరిషత్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ షేక్‌ దస్తగిరి బాషా, పార్టీ 29వ డివిజన్‌ కన్వీనర్‌ సయ్యద్‌ హిమాంసా, షేక్‌ అబ్దుల్‌ ఖుద్దూస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

No comments:

Post a Comment