Friday, 3 August 2018

మతతత్వం.. సింహం తోలు కప్పుకున్న గాడిద

మతతత్వం.. సింహం తోలు కప్పుకున్న గాడిద
04-08-2018 03:03:50

అసలు రూపం ఎప్పుడూ బయటపెట్టదు: రాహుల్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 3: మతతత్వం అనేది సింహం తోలు కప్పుకున్న గాడిద లాంటిదని, సంస్కృతి ముసుగులో అది తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంటుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. దివంగత రచయిత ప్రేమ్‌చంద్‌ నవలల్లో ఈ విషయం స్పష్టంగా గోచరిస్తుందని ఆయన శుక్రవారం హిందీలో ఓ ట్వీట్‌ చేశారు. సింహం తోలు కప్పుకున్న గాడిద తానే అడవికి రాజునన్నట్లుగా ప్రవర్తిస్తుందని, తన అసలు రూపాన్ని బయటపెట్టేందుకు సాహసించదని, ప్రస్తుతం మతతత్వం కూడా అలానే ఉందని విమర్శించారు. ప్రేమ్‌చంద్‌ 134వ జయంతి(జూలై 31)ని పురస్కరించుకొని ఆయనను గుర్తుచేసుకుంటూ ఆలస్యంగా రాహుల్‌ ఈ ట్వీట్‌ చేశారు.

No comments:

Post a Comment