ఎన్ ఆర్ సీ కుదుపు
పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్‌ఆర్‌సీ!
ఇదే డిమాండ్‌తో 11న కోల్‌కతాలో భాజపా సభ
కోల్‌కతా, దిల్లీ: అసోంలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) ప్రస్తుతం జాతీయ రాజకీయ అంశంగా మారింది. దీన్ని వ్యతిరేకించాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం దిల్లీలో ప్రతిపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలన్న డిమాండుతో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 11న కోల్‌కతాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాలులోనూ అసోం తరహా ఎన్‌ఆర్‌సీ వెలువరించాలన్న డిమాండును వచ్చే ఎన్నికల్లో అంశంగా మార్చుతామని భాజపా వర్గాలు తెలిపాయి. సమావేశం నిర్వహణకు స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని రాష్ట్ర భాజపా నాయకులు చెప్పడంతో తాను కోల్‌కతా వెళ్తానని, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని అమిత్ షా ప్రకటించారు. అయితే సభ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్టు కోల్‌కతా పోలీసులు అనంతరం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నారని, అందువల్ల ఇక్కడ కూడా ఎన్‌ఆర్‌సీ రూపొందించాలని భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియా అన్నారు. తాము అధికారంలోకి వస్తే దీన్ని రూపొందిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు.
వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించం
ఎన్‌ఆర్‌సీలో పేర్లులేని వారిపై సీఈసీ స్పష్టీకరణ
దిల్లీ: అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) ముసాయిదాలో నమోదుకాని 40 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ స్పష్టీకరించారు. ఈ విషయంపై బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఎన్‌ఆర్‌సీ ముసాయిదా మాత్రమే. వచ్చే నెల రోజుల్లో ఈ 40 లక్షల మందికీ పేర్లు ఎందుకు తొలగించారో చెబుతారు. దీంతో అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు తమ వాదన వినిపించేందుకూ వారికి ఓ అవకాశం దక్కుతుంది. చివరగా తుది ఎన్‌ఆర్‌సీ ప్రచురితం అవుతుంది’’అని రావత్ తెలిపారు. ఎన్‌ఆర్‌సీకి సంబంధించిన పలు అంశాలపై త్వరలో అసోం ప్రధాన ఎన్నికల అధికారి నివేదిక సమర్పిస్తారని వివరించారు.
భాజపా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది: మమత
అసోంలో పౌరుల గుర్తింపునకు రూపొందించిన ముసాయిదా ఎన్‌ఆర్‌సీకి సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భాజపాపై దాడిని మరింత పెంచారు. భాజపా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అంశం వల్ల బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.

No comments:
Post a Comment