Wednesday, 15 August 2018

ఉమర్ ఖలీద్ ప్రసంగం 18-3-2017

ఉమర్ ఖలీద్  ప్రసంగం 18-3-2017
Collected By : Sharief Vempalle

మిత్రులారా, మొన్న ఢిల్లీ లోఉమర్ ఖలీద్ పై కాల్పుల  చర్య అందరికీ తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన 17 నెలల క్రితం 18-3-2017న చేసిన ప్రసంగం పాఠం గుర్తు చేయడం సందర్భోచితంగా ఉంటుంది. వీలుంటే చదవ గలరు

Shareef
“మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం... ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత”

( మార్చి 18న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖాలిద్‌ చేసిన ప్రసంగ పాఠం ఇది. )

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను.... మనలో కొద్ది మందిపై నేరారోపణలు చేసి, వేధించడం ద్వారా మనల్ని దెబ్బతీయొచ్చని, ఉద్యమాన్ని అణచివెయ్యొచ్చని, అంతకన్నా ముఖ్యంగా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చని ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్న కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.

మిత్రులారా! మమ్మల్ని సెక్షన్‌ 124ఏ – సెడిషన్‌ కింద జైలులో పెట్టారు. 1860 నాటి చట్టాన్ని మాపై ప్రయోగించారు. అంటే మమ్మల్ని జైళ్లో వేయడానికి ఈ సోకాల్డ్‌ జాతీయవాదులు ఆంగ్లేయుల వద్దకు వెళ్లక తప్పలేదు! నల్ల ఆంగ్లేయులు అని భగత్‌సింగ్‌ ఆనాడే పేర్కొన్నది బహుశా వీళ్ల గురించే అయ్యుండాలి! అయితే ఇందులో బాధ పడాల్సింది గానీ, సిగ్గు పడాల్సింది గానీ ఏమీ లేదు. నిజానికి స్వాతంత్య్ర సమరయోధులపై, అధికారాన్ని ప్రశ్నించిన వారిపై మోపిన ఆరోపణలను మాపై మోపినందుకు గర్వంగా ఉంది. ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన బినాయక్‌ సేన్‌, అరుంధతీరాయ్, ప్రొఫెసర్‌ షేఖ్‌ షౌకత్‌ వంటి గొప్ప వాళ్ల సరసన మా పేర్లు నమోదైనందుకు మేం గర్వపడుతున్నాం. సెడిషన్‌ అంటే అర్థం ‘దేశద్రోహం’ కాదు, ‘రాజద్రోహం’ అని అధ్యక్షుడు కామ్రేడ్‌ కన్హయ్య చాలా బాగా చెప్పారు. నేడున్న ఫాసిస్టు, ప్రజావ్యతిరేక రాజ్యంపై… దళిత, ఆదివాసీ, మైనారిటీ, మహిళా, రైతు, కార్మిక, మానవత్వ వ్యతిరేక రాజ్యంపై మా పోరాటం కొనసాగుతుందని గొంతెత్తి చెబుతున్నాను.

అసలైన నేరస్థులు నేడు అధికారంలో ఉన్నారు. అధికారాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు జైళ్లల్లో ఉన్నారు. జైళ్లల్లో ఉన్న ప్రజలెవ్వరో పరిశీలించండి. మారుతి ఉద్యోగులైతే యూనియన్‌ పెట్టుకుంటామన్నందుకు, ఛత్తీస్‌గఢ్‌ లేదా ఝార్ఖండ్‌కు చెందిన ఆదివాసులైతే జల్‌-జంగల్‌-జమీన్‌ గురించి గొంతెత్తినందుకు, దళితులైతే రణవీర్‌సేనకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు జైళ్లో పెడతారు. ఇక ముస్లింలైతే జైళ్లో వేయడానికి కారణం కూడా అవసరం లేదు. వీళ్ల పక్షాన నిలబడ్డ పౌరహక్కుల సంఘాల వాళ్లను కూడా జైళ్లలో వేస్తారు. ఆ క్రమంలోనే మమ్మల్నీ కొద్ది రోజులు జైళ్లో వేశారు. ఇప్పుడు బైటికి వచ్చేశాం కనుక అధికారాన్ని వ్యతిరేకిస్తూ జైలు పాలైన వారందరి పోరాటాన్ని ఇకపై మనం కొనసాగిద్దాం.

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని మనం అంటున్నాం. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. అధికారానికి మీరు ఏ వైపున్నారనే దానిపై ఆధారపడి మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రభుత్వానికి అనుకూలమైతే, మోడీ, తొగడియా, యోగీ ఆదిత్యనాథ్‌ వంటి వారి కోవకు చెందిన ఛోటా మోటా నేతలందరికీ కావాల్సినంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక, పౌర హక్కుల కార్యకర్తలను స్టెన్‌గన్‌లతో కాల్చి చంపాలని బాలా సాహెబ్‌ ఠాక్రే బాహాటంగానే అన్నాడు. ముస్లింలను చంపెయ్యాలన్నాడు. ఆయనపై రాజద్రోహం సంగతి అటుంచి, చిన్న కేసైనా పెట్టలేదు.

గత నెలాపదిహేను రోజులుగా జరుగుతున్న సంఘటనల్లో మా వైపు నుంచి ఏదైనా తప్పు జరిగిందా అని నేను జైలులో ఉండగా చాలా సార్లు ఆలోచించాను. 9, 10, 11 తేదీల్లో ఏం జరిగిందో ఆలోచించినప్పుడు నాకో సినిమా గుర్తుకొచ్చింది. 1973లో చిలీలో జరిగిన ఫినోషిట్‌ ‘సైనిక కుట్ర’ ఆధారంగా రూపొందిన ‘మిస్సింగ్‌ కోస్తా గావ్రాస్‌’ సినిమాలోని ఒక సంభాషణ గుర్తుకొచ్చింది. ఆ సమయంలో చిలీలో నివసిస్తున్న ఒక అమెరికన్‌ వ్యక్తి కుమారుడు అదృశ్యమవుతాడు. ఆయన ‘నా కొడుకు ఏమీ చెయ్యలేదు కదా అతణ్నెందుకు మాయం చేశార’ని ఒక చిలీ దేశస్థుణ్ని అడుగుతాడు. ఆ వ్యక్తి ఇలా జవాబిస్తాడు, ‘మీ అమెరికన్లతో ఇదే చిక్కు. జైలుకు పోవాలంటే ఏదైనా చేసి తీరాలని మీరనుకుంటారు’. సరిగ్గా నేడు మన దేశం పరిస్థితి కూడా ఇలాగే తయారైంది!

నేను జైషే మహ్మద్‌కు చెందిన వాడినని మొదట నా గురించి ప్రచారం చేశారు. అది ఎక్కువ రోజులు సాగలేదు కానీ ప్రజల మనస్సుల్లో ఒక ముద్రనైతే వేసింది. అయితే ఈ మీడియా ట్రయల్, ప్రొఫైలింగ్‌ ఫిబ్రవరి 23న మేం సరెండర్‌ అయిన తర్వాత కూడా కొనసాగడం విచిత్రం! రోజుకో కొత్త కథనం సృష్టించసాగారు. ఉదాహరణకు 21న మేం జేఎన్‌యూకి తిరిగొచ్చిన తర్వాత 23న ‘హిందూస్తాన్‌’ అనే పత్రికలో ‘ఉమర్‌ ఖాలిద్‌ ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దు అడవుల్లో నక్సలైట్లతో ఉన్నాడు’ అని రాశారు. నిజానికి ఆ సమయంలో నేను అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వద్ద కూర్చుని ఉన్నాను. అట్లాగే, కస్టడీలో ఒకరోజు ఒక పోలీసు అధికారి తన ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. అందులో నాతో పాటు ఒక జేఎన్‌యూ పూర్వ విద్యార్థి ఉన్నాడు. ‘ఇది మాకు ఐబీ నుంచి వచ్చింది. నీకు నక్సలైట్లతో సంబంధాలున్నాయనడానికి ఇదే రుజువు’ అని ఆ అధికారి అన్నాడు. ఇది తప్పని నేనాయనకు చెప్పాను. మొదటి విషయం మీరు చూపిస్తున్న వ్యక్తి నక్సలైటు కాదు, జేఎన్‌యూ విద్యార్థి. రెండో విషయం ఇది నా ఫేస్‌బుక్‌ పేజీలోంచి తీసుకున్న ఫోటోనే. ఇక ఇంటలిజెన్స్‌ బ్యూరో వాళ్ల ఇంటలిజెన్స్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ మొత్తం వ్యవహారంలో మీడియా పోషించిన పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. మీడియా స్వతంత్రంగా పని చేసిందని నేననుకోను. మీడియాలో ఒక వర్గానికి ఏం ప్రసారం చెయ్యాలనే విషయంలో కచ్చితమైన నిర్దేశాలున్నాయని నా నమ్మకం. ఈ నమ్మకానికి ఆధారాలున్నాయి. చాలా కేసుల్లో ఇలాగే జరిగింది. సాధారణంగా పోలీసులు విచారణ జరిపించి ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ వాస్తవంలో దానికి పూర్తిగా తలకిందులుగా జరుగుతున్నది. ముందు మీడియా విచారణ జరిపిస్తుంది. తర్వాత పోలీసులకు సమాచారం అందజేస్తుంది. దాని ఆధారంగా పోలీసులు ఇంటరాగేషన్‌ చేస్తారు. తర్వాత విచారణ చేపడతారు!

క్రితంసారి నేనిక్కడ మాట్లాడినప్పుడు ఒక మాటన్నాను. గత ఏడేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా భావించలేదని చెప్పాను. అయినా మీడియాలో నన్నొక ఇస్లామిక్‌ టెర్రిరిస్టుగా చూపించారు
😢
👍
2

No comments:

Post a Comment