Saturday, 11 August 2018

బెంగాల్ని మరో అస్సాంగా అమిత్ షా నేటి ప్రకటన!

బెంగాల్ని మరో అస్సాంగా  అమిత్ షా నేటి ప్రకటన!

 మిత్రులారా, అస్సాం NRC ప్రక్రియ వెనక ఫాసిస్టు లక్ష్యాల గూర్చి నిన్నటి వ్యాసంలో ఈరోజు కలకత్తా లోఅమిత్ షా సభ వుందని ప్రస్తావన చేయడం గుర్తు ఉండే ఉంటుంది. ఒక్క ఏడాది కాలంలో ఆయన ఇది ఆరోసారి పర్యటన. జూన్ 27న 600 మందికి పైగా రచయితలు, సినీ ప్రముఖులు,కళాకారులు, శాస్త్రవేత్తలు, వివిధరంగాల కోవిధులకి ఆహ్వానంతో బంకిమ్ చంద్ర స్మారక వేదిక పేరిట బెంగాల్ BJP ఏర్పాటుచేసిన "మేధావుల సభ" కి కూడా అమిత్ షా ప్రత్యేక అతిధిగా హాజరు కావడం తెలిసే ఉంటుంది. (ఆహ్వానాలు అందుకున్న తొంబై శాతం కి పైగా సభని తమకి తాము అప్రకటితం గా బహస్కరించి హిందుత్వ కుట్రల పట్ల బెంగాలీ మేధో వర్గాలు తగు రాజకీయ విజ్ఞతని ప్రదర్శించడం జరిగిందనుకోండి). తిరిగి మిడ్నపూర్ లో ఒక సభ జరిపితే అది కూలిపోయి ప్రమాదం జరిగి బెంగాల్ లో BJP అభాసు పాలైనది. తాజా అస్సాం NRC దుష్పలితంతో తిరిగి పుంజుకుని ఈ రోజు భారీ అట్టహాసంతో కలకత్తా లో సభని నిర్వహించింది. ఈ నేపథ్యంలో జరిగిన నేటి సభ సారాంశం లోకి వెళదాం. బెంగాల్ ప్రజలు తమని ఆదరిస్తే అస్సాం తరహా NRC ప్రక్రియని BJP చేపడుతుందని ఆయన హామీ ఇచ్చాడు. అందులో ఆయన ప్రసంగం లో చేసిన ఓ ప్రకటన ఇలా ఉంది. "ఇప్పటి వరకు 19 రాష్ట్రాలలో మా BJP అధికారం పొందినందుకు  నిజానికి మేము గర్వ పడటం లేదు. 2014లో కేంద్రంలో పొందిన గెలుపు కూడా మాకు ఘన విజయం కాదు. రేపు బెంగాల్ రాష్ట్రంలో గెలుపు మా ప్రధాన లక్ష్యం. అది నెరవేరిన రోజు మాకు నిజమైన ఘన విజయం. ఆ తర్వాత నేడు అస్సామ్ లో చేపట్టిన NRC ప్రక్రియ ని రేపు బెంగాల్లో కూడా మా BJP ప్రభుత్వం చేపట్టి తీరుతుంది. NRC ప్రక్రియ ద్వారా రేపు కోటి మందికి పైగా విదేశీయులు ఇదే బెంగాల్లో తేలనున్నారు. అట్టి విదేశీయులని మా BJP సర్కారు దేశం నుండి బయటకు గెంటి వేస్తుంది. అప్పుడు మాత్రమే మా BJP నిజమైన దేశ భక్తియుత పార్టీగా గర్వ పడుతుంది" అని తమ పార్టీ ముఖ్య కార్యకర్తల (hard core party &RSS core cader) చప్పట్ల మధ్య ఈరోజు కోల్కత్తా  సభలో అమిత్ షా వీరావేశంగా ప్రకటించాడు. ఇందులో ఎలాంటి దేశ భక్తి లేదు. పైగా పచ్చి ఫాసిస్టు రాజనీతి దాగి ఉంది. ఒక వైపు బడా విదేశీ పెట్టుబడి దారులతో రోజు రోజుకూ మరింత అంటకాగుతూ; మరోవైపు తమ రెక్కలు తప్ప ఆస్తులు లేని రోజు కూలీలపై ఫాసిస్టు యుద్ధం చేయడానికి శపధమిది. అది చేపట్టిన రోజు తమకి వాస్తవ విజయంగా చెప్పడమంటే గత దేశ విభజన(1947) నాటి నెత్తుటి మారణ హోమం సృష్టించే స్పష్టమైన ఫాసిస్టు లక్ష్యం కనిపిస్తుంది. పైగా దీనికి "దేశభక్తి" నామ కరణంచేయడంగమనార్హం. 1933 లో హిట్లర్ జర్మన్ ఛాన్సలర్ గా ఎన్నిక కావడం చరిత్రలో ఒక తిరోగమన మూల మలుపు. అలాంటి మూల మలుపు వంటి ఘన విజయం పేద ప్రజల నెత్తుటి ప్రవాహాల ద్వారా మాత్రమే సాధ్యం. అది మాత్రమే తమకి వాస్తవ ఘన విజయమని అమిత్ షా మనస్సులో మాట నేడు కలకత్తాలో చెప్పాడు. ఎన్నో ఎన్నెన్నో డ్రెస్ రిహార్సల్స్ తరువాతే 60 లక్షల మంది యూదుల మారణకాండ జర్మన్ లో జరిగింది. ఇక్కడ కూడా బాబిరీ, గోద్రా, దాద్రీ, ఉనా వంటి డ్రెస్ రిహార్సల్స్ తమ దృష్టిలో విజయాలు కాదని, లక్షలాది మంది నిరుపేదల ని వెల్లగొట్టే పేరిట సాగే రేపటి మానవ మారణ హోమం నిజమైన ఘన విజయమని నేడు అమిత్ షా  తమ రహస్య అంతరంగాన్ని ఆవిష్కరణ చేయడమిది. అన్ని రకార ప్రగతిశీల శక్తులు ఈ ఫాసిస్టు రహస్య రాజకీయ ఎజెండా ని అర్ధం చేసుకుని దేశ ప్రజలని చైతన్య పరచాల్సి ఉంది. ఈ దిశలో కరవ్యోన్ముఖులం అవుదాం- పి ప్రసాద్(ఐ.ఎఫ్.టి.యూ) 11-8-2018


No comments:

Post a Comment