వక్ఫ్ బోర్డు ఆస్తులపై సమగ్ర సర్వే
01-02-2018 06:27:13
హైదరాబాద్: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలాల సర్వే సమగ్ర నివేదికను రూపొందించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై దానకిషోర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సర్వే పనులు పూర్తి చేసినప్పటికీ వక్ఫ్ బోర్డు స్థలాలకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై దానకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారం రోజుల్లో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, వివాదరహితంగా ఉన్న స్థలాల వివరాలను అందించాలని దానకిషోర్ సూచించారు. అలాగే విడాకులు పొందిన ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. దీనిపై జిల్లాలవారీ నివేదికను అందించాలని కోరారు. వక్ఫ్ బోర్డు నిధుల వ్యవహారంపై సమీక్షించారు. అలాగే ఇమామ్, మౌజాన్‌లకు గౌరవ వేతనం చెల్లింపుల వివరాలను తెలుసుకున్నారు. బకాయిలను సాధ్యమైనంత తొందరలో చెల్లించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి మన్నాన్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment